728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 29, 2022

చిలకలూరిపేట పురపాలక సంఘంలో బ్లీచింగ్ కొరత....నాసి రకం బ్లీచింగ్ సరఫరా చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతారా...!?


చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో 38 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో సుమారు 15 వార్డులు స్లం ఏరియాలో ఉన్నాయి.  కాగా గత కొన్ని నెలల నుండి చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో బ్లీచింగ్ కొరతతో వార్డులో బ్లీచింగ్ చల్లటం లేదు.    పారిశుధ్య  కార్మికులకు బ్లీచింగ్ పౌడర్ ఇవ్వడం లేదని వారు బిక్కమొహం వేస్తున్నారు.  గత కొద్ది నెలల క్రితం సత్తెనపల్లి చెందిన ఒక కాంట్రాక్టర్ పురపాలక సంఘానికి సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకూ నాసిరకం బీజింగ్ సరఫరా చేసినట్లు తెలుస్తుంది. సంబంధిత బిల్లులు కూడా గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ చేయకుండా పెండింగ్ పెట్టారు.  అనంతరం సుమారు లక్ష రూపాయల పురపాలక సంఘానికి ఆ కమిషనర్  తెప్పించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పౌడర్ కొరత ఉన్నట్లు పారిశుద్ధ కార్మికులు చెబుతున్నారు. మరి నాసిరకం బ్లీచింగ్ పౌడర్ తెచ్చిన కాంట్రాక్టర్ బిల్లులు మున్సిపల్ అధికారులు చేశారా...? లేదా...? అని గత పది రోజుల నుండి మున్సిపల్ కార్యాలయం లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాసిరకం బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేసిన  కాంట్రాక్టర్ ను  30 తేదీ జరిగే కౌన్సిల్ సమావేశం లో బ్లాక్ లిస్టులో పెడతారా ...లేదా.... అని కౌన్సిలర్లు చర్చించుకుంటున్నట్లు  విశ్వసనీయంగా తెలిసింది.  గత నెల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు  బ్లీచింగ్ కుంభకోణం జరిగిందని అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయంపై కూడా రేపు  30వ తేదీ జరిగిన కౌన్సిల్ సమావేశంలో సమాధానం చెబుతా రాలేదా వేచి చూడాల్సిందే..!?.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పురపాలక సంఘంలో బ్లీచింగ్ కొరత....నాసి రకం బ్లీచింగ్ సరఫరా చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతారా...!? Rating: 5 Reviewed By: NEWS UPDATE