728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 29, 2022

చిలకలూరిపేటలో బస్ కింద పడి విద్యార్థి దుర్మరణం... విద్యార్థి వద్ద సూసైడ్ నోట్

చిలకలూరిపేట: చిలకలూరిపేట కేబీ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ ఎదురు సమీప ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. 

భాష్యం స్కూలు బస్సు పురుషోత్తమపట్నం అడ్డ రోడ్డు వైపు నుంచి తహాసిల్దార్ కార్యాలయం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు బస్సు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే సదరు యువకుడి వద్ద సూసైడ్ లెటర్ ఉండటం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ సమయంలో చిలకలూరిపేట 108 సిబ్బంది అటుగా వెళుతూ మానవతా దృక్పథంతో వాహనాన్ని ఆపి పరిశీలించగా అప్పటికే యువకుడు మృతి చెంది ఉండడంతో వారు వెనుదిరిగి వెళ్లారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో బస్ కింద పడి విద్యార్థి దుర్మరణం... విద్యార్థి వద్ద సూసైడ్ నోట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE