గుంటూరు: రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు తమ ప్రభుత్వం వదిలిపెట్టద్దన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని రేపల్లె ఆస్పత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి మా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
May 1, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

