728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 5, 2022

చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 700 మందికి విద్యా దీవెన పథకం హుల్లక్కే


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో జగనన్న విద్యా దీవెన పథకం లో భాగంగా సుమారు 700 మంది వరకు విద్యార్థులకు నిరాశే ఎదురైంది. విద్యా దీవెన కోత విధించే పథకంలో లో భాగంగా ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఫోర్ వీలర్ వెహికల్, 1500 గజాల ఇంటి స్థలం, ఇన్కమ్ టాక్స్, కరెంట్ బిల్లు తదితర కారణాలతో మీరు అర్హులు కాదని సచివాలయం ద్వారా సమాచారం అందించారు.  పట్టణంలో 29 వార్డు సచివాలయంలల్లో  ఒక్కొక్క సచివాలయానికి సుమారు పది మంది వరకు ఈ విద్యాదీవెన అర్హులు కారని సమాచారం అందించారు 


చిలకలూరిపేట, ఎడ్లపాడు,నాదెండ్ల రూరల్ పరిధిలో సుమారు మూడు నుండి నాలుగు వందల మంది వరకు ఉండవచ్చు. ఈ లెక్కన నియోజకవర్గ పరిధిలో సుమారు 700 మందికి విద్యార్థి ఉన్నారని సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే విద్యా దీవెన పథకం ద్వారా తాము డిగ్రీలు ఇంజనీరింగ్ విద్యా చదువుకొని స్థిరపడతామని భావించిన  విద్యార్థులకు, నిరుపేదలకు ఈ కోత శాపంలా మారింది. తమకు  విద్య ఎలా సాగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 


గతంలో పెన్షనర్లకు కోత విధించినప్పుడు ఎమ్మెల్యే విడదల రజిని సచివాలయ అధికారుల  ద్వారా సమావేశం ఏర్పాటు చేయించి వారందరికీ కావలసిన పత్రాలు సిద్ధం చేయించి  400 మందికి పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టారు.  ప్రస్తుతం సుమారు 700 మంది విద్యార్థులకు పథకం అర్హులు కారని అందిన సమాచారం మేరకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వారికి కూడా సరైన పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకొని సహాయం  చేయాలని రాష్ట్ర మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ను నియోజకవర్గ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 700 మందికి విద్యా దీవెన పథకం హుల్లక్కే Rating: 5 Reviewed By: NEWS UPDATE