728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2022

మేరీ మాత విగ్రహ విధ్వంసకారులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించండి

చిలకలూరపేట: పరమ పవిత్రమైన విగ్రహాలను ధ్వంసం చేసి లక్షలాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన సంఘ విద్రోహ శక్తులను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయ అఖిలపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన విగ్రహాలు జోలికి ఎవరూ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు అని గ్రామ ప్రజలతోపాటు భక్తుల సహాకారంతో నిర్మించబడిన దేవతామూర్తులను అవమానించడం ధ్వంసం చేయడం మానవత్వానికి మాయని మచ్చ అని అన్నారు ప్రజల హృదయాలను గాయపరిచి వారి విశ్వాసాలను దెబ్బ తీసే చర్యలు పునరావృతం కాకుండా చూడాలని బాధ్యులైన వారిని వారిని వారి వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైన మన పోలీసు వ్యవస్థ సంఘటనలకు కారకులైన వారిని ఇచ్చిన గడువు కన్నా ముందు అరెస్టు చేసి ప్రజల్లో ని ఆందోళన ఆవేదన పోగొట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎడ్లపాడులో ధ్వంసమైన మేరీ మాత విగ్రహాలను సంఘటనా స్థలాన్ని పరిశీలించి అర్ధగంట పాటు మౌన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి చుక్కా చంద్రపాల్ సిపిఐ ఏరియా కార్యదర్శి నాగభైరు సుబ్బాయమ్మ, సిపియం నాయకులు పేరు బోయిన వెంకటేశ్వర్లు, ఫాదర్ సుభాష్ చంద్రబోస్, సిపిఐ పార్టీ కి చెందిన తాళ్ళూరి బాబూరావు పేలూరి రామారావు దాసరి వరహాలు సిపిఎం నాయకులు కారుచోల రోశయ్య జరుగుల శంకరరావు, తోకల కోటేశ్వరరావు, పిల్లుట్ల సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్లూరి హనుమయ్య, కారుచోల స్వప్న కుమార్, దార్ల రాజు, అద్దంకి అనిల్ కుమార్ ,జిల్లిబోయిన అమర్, నటరాజ వెంకటేష్ తేవర్ మాచవరపు కొండలు కారుచోల రాజేష్ తాళ్ళూరి నాగేశ్వరరావు, పి రామారావు, యస్ నరసింహారావు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మేరీ మాత విగ్రహ విధ్వంసకారులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించండి Rating: 5 Reviewed By: NEWS UPDATE