చిలకలూరి పేట నియోజకవర్గం యడ్లపాడు మండలం వంకాయలపాడు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు.
చంద్రబాబుకు స్వాగతం పలికిన మాజీ మంత్రి పుల్లారావు.
*కోనసీమ ఘటనపై స్పందించిన చంద్రబాబు నాయుడు...*
*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్....*
*కోనసీమన వైసీపీ మనుషులే తగులపెట్టారు.*
అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదే.
*పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారు.*
*మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదు.*
*వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారు.*
*తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగనుకు అలవాటుగా మారింది.
*ప్రభుత్వాన్ని జగన్ నడపలేరు.*
*మధ్యంతరానికి జగన్ సిద్దపడుతున్నారు.*
టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.
టీడీపీ కార్యకర్తలెవరూ భయపడరు.
జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా.
ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా..?
మహానాడుకు బస్సులివ్వకుండా.. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారు.
ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా..?
జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి.
మహానాడుకు నడిచైనా.. ఎడ్లబళ్లల్లోనైనా రండి.
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదం.
ఆ వర్గమైనా బాగున్నారా..? ఏ ఒక్క వర్గం బాగుందన్నా.. తిరిగి అమరావతికి వెళ్లిపోతా.
వైసీపీలో ఎక్కడుంది సామాజిక న్యాయం.
*ఉత్తరాంధ్రకు, రాయలసీమపై ప్రేమ లేదు.. అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించ లేదు.*
*విశాఖ మీద ప్రేముంది.. రాజధాని తీసుకెళ్తానన్నవాడు.. రాజ్య సభ స్థానాలు ఎందుకు కేటాయించ లేదు.*
*తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారు.*
*ఏ ముఖం పెట్టుకుని బస్ యాత్ర చేపడతారు.*
ఎస్సీలకు చెందిన 28 స్కీములు రద్దు చేశారు.
డబ్బులున్న వాడికి ఊడిగం.. పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ.
బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది.
*దావోస్ కు వెళ్లి అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు చేసుకున్నారు.*
*టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు కొనసాగించరా..?*
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు.
టీడీపీ పోరాడితే కేసు నమోదు చేశారు.
అనంతబాబు వ్యవహరంలో వైసీపీని ప్రజలు ఛీ కొట్టారు.

