హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ పంచెర్ పడి రోడ్డుపై నిలుపుదల చేశారు. కేశానుపల్లి MAM కాలేజీ వద్ద చీకట్లో లారీ నిలిచి ఉన్న విషయాన్ని తెలియజేసే విధంగా ఎటువంటి సిగ్నల్ లేకుండా ఉండటం తో అటుగా వెళ్తున్న వాహనాలు వెనుకనుంచి ఢీకొన్నాయి. దీంతో ఒక ఇషర్ వాహనం, దాని వెనుక మరొక కారు డీ కొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ట్రాఫిక్ పాక్షికంగా నిలిచిపోయింది. నరసరావుపేట రూరల్ పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేస్తామని అన్నారు. ప్రమాదానికి గురైన కారు చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ శివుడు కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
కారును ఢీకొన్న లారీ ....కారులో చిలకలూరిపేట చెందిన ప్రముఖ డాక్యుమెంట్ రైటర్