చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణంలోని నాలుగు విత్తనాల దుకాణాలపై జిల్లా వ్యవసాయాధికారి, మండల వ్యవసాయాధికారులతో కలసి టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణ పరిధిలోని శ్రీ సాయి రామ్ ఏజెన్సీస్, భాగ్య లక్ష్మి ఫెర్టిలేజర్స్, వాసవి ఎంటర్ ప్రైజేస్, అనంతలక్ష్మి ట్రేడర్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయా దుకాణాల పరిధిలో రికార్డులు సక్రమంగా నిర్వహించని కారణంగా రూ. 10,60,464 విలువైన విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు. నాలుగు బృంధాలుగా ఏర్పడిన అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయాధికారి మురళి, ఏడీఏ సీహెచ్ రవికుమార్, చిలకలూరిపేట వ్యవసాయాధికారి టి శ్రీలత, ఏవోలు సుజాత, ప్రియదర్శని పాల్గొన్నారు.
May 25, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: విత్తనాల దుకాణాలపై జిల్లా వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

