728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 3, 2022

నిరూపిస్తే నేను రాజీనామా కు సిద్ధం... నిరూపించ లేకపోతే మంత్రి విడదల రాజీనామా చేస్తారా..? మాజీమంత్రి పత్తిపాటి సవాల్

చిలకలూరపేట: నా కుటుంబ సభ్యులు ఏ విందులో పాల్గొన్నారో నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బాయ్ చెబుతామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలోని పత్తిపాటి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి విడదల రజిని పై ఘాటుగా విమర్శలు చేశారు.

మా కుటుంబ సభ్యులు ఏ విందులో పాల్గొన్నారో మీరు నిరూపించ లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా...? రాజకీయాల నుంచి  
తప్పుకుంటారా అంటూ ప్రత్తిపాటి సవాల్ విసిరారు..


తనపై కుటుంబ సభ్యులపై నిత్యం ఎన్నో అసత్య ప్రచారాలు అబద్ధాలు లేనిది ఉన్నట్లుగా చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. చిలకలూరిపేట శాసనసభ్యురాలు తెలుగుదేశం పార్టీలోకి 
చేరకముందు ఎక్కడున్నారు వారు ఏం చేస్తున్నారో చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు.

తెలుగుదేశం పార్టీ లోకి చేరి ఇక్కడ మహానాడులో డయాస్ పంచుకొని ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చి ఇక్కడ నాయకులతో ఎన్నో మాయమాటలు అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేశారన్నారు.
తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా చేస్తే డ్యామేజ్ అయితే తెలుసుకొని విస్తృత స్థాయిలో వారికి కావాల్సిన
విధంగా మలుచుకొని
వైఎస్ఆర్ సిపి లోకి వెళ్లి మా తెలుగుదేశం పార్టీ నాయకులకూ 
ఎన్నో మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని తెలిపారు. నియోజకవర్గంలో
100 బుల్లెట్లు ఇస్తాము కార్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తామని 
మా కంపెనీలో అంటూ ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని పత్తిపాటి తీవ్రంగా విమర్శించారు.

తనపై కుటుంబ సభ్యుల పై నిత్యం తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 
మంత్రి కూడా అయ్యారు... సంతోషమే కాదనటం లేదు... మంత్రి అయి దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాలు అరాచకాలపై 
స్పందించకుండా నా పైన కుటుంబ సభ్యుల పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక టీవీ9 ఛానల్ లో 
చూపించారు. మీరేదో విందులు వినోదాలు చేస్తుంటే మా కుటుంబ సభ్యులు వచ్చారు అని నిరూపించండి... లేకపోతే
మీరు మీమంత్రి 
పదవికి రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేసారు ప్రత్తిపాటి..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిరూపిస్తే నేను రాజీనామా కు సిద్ధం... నిరూపించ లేకపోతే మంత్రి విడదల రాజీనామా చేస్తారా..? మాజీమంత్రి పత్తిపాటి సవాల్ Rating: 5 Reviewed By: NEWS UPDATE