728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 8, 2022

చిలకలూరిపేట: నరకానికి నకళ్ళు ఆ రోడ్లు.... రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తాం... గ్రామస్తులు


చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం నుండి ఆంజనేయస్వామి గుడి హైవే కు రావాలంటే బొప్పుడి చుట్టుపక్క గ్రామాల ప్రజలకు రోజు రోజుకు దిన గండంగా మారుతుంది. బైక్లపై చిన్నచిన్న వాహనాలపై వచ్చే వారు ఏ క్షణం లో ఆ రోడ్డున జారి పడతారో తెలియని దుస్థితి దాపురించింది.  చిలకలూరిపేట మండలం బోప్పుడి  గ్రామ పరిధిలో స్టోన్ క్రషర్స్ ఉండటం వల్ల నిత్యం కొన్ని వందల టాక్టర్లు కంకర వేసుకొని చుట్టుపక్కల గ్రామాలకు  తీసుకెళ్తుంటారు. అయితే ట్రాక్టర్పై ఈ కంకర  వేసుకుని స్పీడ్ గా వెళ్లడం, ట్రాక్టర్ డ్రైవర్కు  లైసెన్స్ లేకుండా వుండటం, నిష్ణాతులు కాకుండా ఎవరు పడితే వారు ఆ ట్రాక్టర్ నడపడం వల్ల గతంలో అనేక సార్లు రహదారిపై రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.  అయితే ట్రాక్టర్ నుంచి కంకర జారి కింద పడటంతో నడిచి వెళ్లే వారు, బైక్పై వెళ్లేవారికి అనేక ప్రమాదాలు సంభవించాయి. సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని కంకర రోడ్డు మీద పడకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడిపేలా స్టోన్ క్రషర్ యజమానులు తగిన రక్షణ ఏర్పాట్లు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని చుట్టుపక్క గ్రామ ప్రజలు కోరుతున్నారు. రక్షణ చర్యలు చేయకపోతే బొప్పూడి గ్రామస్తులు సంబంధిత అధికార కార్యాలయాల వద్ద ధర్నా స్టోన్ క్రషర్స్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నరకానికి నకళ్ళు ఆ రోడ్లు.... రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తాం... గ్రామస్తులు Rating: 5 Reviewed By: NEWS UPDATE