నరసరావుపేట: కొత్త జిల్లాగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి వైభవంగా ఆదివారం శంకుస్థాపన జరిగింది. నరసరావుపేట పట్టణంలోని.. పల్నాడు రోడ్డులో పార్టీ కార్యాలయ శంకుస్థాపన. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ప్రభుత్వవిప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. శాస్త్రోక్తంగా కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత సీఎం జగన్‌మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడిని నియామకం చేశారని, వారిపై పార్టీ కీలక బాధ్యతలను ఉంచారని అన్నారు. వైస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేరువచేసేలా మరియు పార్టీ కేడర్‌కు ఎటువంటి ఇబ్బందులు కల్గినా వాటిని వెంటనే పరిష్కరించేందుకు గాను వారిపై బాధ్యతలు ఉంచారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. రానున్న ఎలక్షన్‌లో పార్టీకి పెద్ద విజయాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి , తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వైసిపి కార్యాలయానికి శంకుస్థాపన చేసిన ఎంపీ