చిలకలూరిపేట: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల ట్రస్టు వద్ద ఈ నెల 13న జరిగిన వివాదానికి సంబంధించి పోలీసులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తో పాటు టీడీపీ నాయకుల పై 323,353,506,509, 34 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పనుల సందర్శన నిమిత్తం వెళుతున్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ నాయకుల పై, పార్టీకి చెందిన ఎస్సి, ఎస్టీ మైనార్టీ మహిళా కార్యకర్తలపై ముందస్తుగా వేసుకున్న పధకం ప్రకారం దాడి చేశారని టీడీపీ నాయకురాలు రాయనీ పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకొని మునిసిపల్ అధికారులు అయిన టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ కోడిరేక్క సునీతఏ 1 గా, రెవెన్యూ ఆఫీసర్ ఆ రోజు ఇన్చార్జి కమిషనర్ అయిన పి. ఫణి కుమార్ ఎ2గా, మరో మున్సిపల్ ఏ.ఈ పులి కోటేశ్వరావు ఏ 3 గా, ఎ 4 గా ఎస్.నవ్య, ఎ 5 గా టి.మాధురి మరి కొంత మందిపై చిలకలూరిపేట అర్బన్ పోలీసులు 323, 509, 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..
May 19, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ ఉద్యోగులపై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

