మాజీ మంత్రి టిడిపి నాయకులు నారాయణను అరెస్ట్ చేయబోయే ముందు కనీసం అధికారులు ఆలోచించుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట లోని తన స్వగృహంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలకు మాజీ మంత్రి నారాయణ ఎప్పుడో రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రభుత్వం టిడిపి పార్టీ నాయకులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తుందని ఆయన తెలియజేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై రింగ్ రోడ్ కుంభకోణం కేసు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రింగ్రోడ్డు వేయకుండా కాగితాలు కూడా లేవని గతంలో చెప్పిన నాయకులు నేడు రింగ్ రోడ్ లో కుంభకోణం జరిగిందని కేసు పెట్టటం ఏమిటని వైసిపి నాయకులను ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అందర్నీ కలుపుకొని వ్యతిరేక ఓట్లు చీలకుండా రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి విడదల రజిని పై స్టైర్లు విసిరారు మాజీ మంత్రి పత్తిపాటి. ఫేస్బుక్ లో మంత్రి విడదల రజిని కు లైకులు ప్రధానమంత్రి కంటే ఎక్కువ వస్తున్నాయని ప్రతి లైకు కు ఏడు రూపాయలు కడుతున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం తప్ప తమ శాఖ విషయం గురించి మంత్రి విడదల రజిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

