728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 10, 2022

పల్నాడు జిల్లాలో రౌడీషీటర్ ల పై నేరగాళ్ల పై నిరంతర నిఘా...DIG


 నూతన పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ,చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడి మొదలగు వాటి గురించి జిల్లా పోలీస్ మరియు SEB అధికారులతో సాధారణ సమీక్ష సమావేశం నిర్వహించిన గుంటూరు రేంజ్ డీఐజీ డా CM. త్రివిక్రమ వర్మ మరియు SEB డైరెక్టర్ డీఐజీ రమేష్ రెడ్డి. 

ఈ సందర్భంగా గౌరవ డీఐజీ గారు మాట్లాడుతూ  నూతన పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా అధికారులందరితో సాధారణ సమీక్ష నిర్వహించడం జరిగినది. మహిళలు మరియు చిన్నారుల సంరక్షణ, దిశా యాప్ డౌన్లోడ్ మరియు ఉపయోగం గురించి ప్రజలకు అవగాహన,దిశా యాప్ ద్వారా వచ్చే బాధితుల ఫిర్యాదులను తక్కువ కాలంలో పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలు మొదలగు ఆయా అంశాలను చర్చించడం జరిగినది.

తరచూ గొడవలు జరిగే మరియు ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న గ్రామాలపై దృష్టి సారించి,అక్కడ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా మరియు సాధారణ నేరాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చిండం జరిగినది.

జిల్లాలోని రౌడీ షీటర్లు,నేర చరిత్ర కలిగిన వారు,చేదు నడత కలిగిన వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి,ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగినది. ముఖ్యంగా నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి,అక్కడ గస్తీ ఏర్పాటు చేయాలని,మునుపు రైల్వే స్టేషన్లలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలు మరల పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగినది. SEB డైరెక్టర్ డీఐజీ  రమేష్ రెడ్డి  మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారీ మరియు సరఫరాను కూకటివేళ్ళతో పెకిలించడానికి పోలీస్ మరియు SEB అధికారులు ఇరుశాఖల వారు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించడం జరిగినది.

పోలీస్ అధికారులు, మీమీ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో నాటుసారా తయారీ స్థావరాలపై విస్తృత దాడులు జరిపి,తయారీ దారులపై ఉక్కుపాదం మోపాలని,కేసులు నమోదు చేయాలని, అవసరం అయితే పీడి చట్టం కూడా ప్రయోగించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగినది. నాటుసారా వలన కలిగే అనర్ధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించడం జరిగినది.SEB మరియు పోలీస్ అధికారుల సమిష్టి కృషితో పల్నాడు జిల్లాలో నాటుసారా మహమ్మారిని రూపుమాపుతామనే ఆశాభావాన్ని గౌరవ SEB డైరెక్టర్ గారు వ్యక్తం చేశారు.

తదనంతరం నూతన పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని గుంటూరు రేంజ్ డీఐజీ, SEB డైరెక్టర్ గmలు,ఇతర పోలీస్ అధికారులు సందర్శించి, పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో డీఐజీ లతో పాటు పల్నాడు జిల్లా SEB జాయింట్ డైరెక్టర్ బిందుమాధవ్, నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి ,సబ్ డివిజన్ల డిఎస్పీలు,సీఐలు,ఎస్సైలు,SEB అధికారులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పల్నాడు జిల్లాలో రౌడీషీటర్ ల పై నేరగాళ్ల పై నిరంతర నిఘా...DIG Rating: 5 Reviewed By: NEWS UPDATE