చిలకలూరిపేట పట్టణ పరిధిలోని మంచినీటి చెరువు వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ సుజల పథకం ప్లాంట్ను ప్రారంభించే కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టిడిపి నాయకుల మధ్య వాదోపవాదాలు నెట్టు కోవడం, మండల టిడిపి అధ్యక్షుడు చొక్కా చినగడం మధ్య గంటసేపు వాతావరణం వేడెక్కింది. ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించడంతో గురువారం రాత్రి మున్సిపల్ అధికారులు ప్లాంటు ప్రారంభోత్సవం చేయకూడదని వాటికి అనుమతులు లేవని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్ వద్దకు సిఐలు, ఎస్ఐలు పోలీసులు భారీ ఎత్తున చేరుకొని మాజీ మంత్రి పత్తిపాటి వారి అనుచరులను ప్లాంట్ లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నాయకులను ప్లాంట్ లోపలికి వెళ్ళనీవలేదు. మున్సిపల్ అధికారులు మాత్రం వాటికి అనుమతులు లేవని ఓపెన్ చేయడానికి వీలు లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి కి విన్నవించారు. అయితే ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆస్తి అని ప్రజలకు ఇవ్వాల్సిన మంచినీటి పథకం ప్రారంభించడం అనే కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంకు విరుద్ధంగా జరుగుతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.పోలీసులకు టీడీపీ వారికి జరిగిన తోపులాటలో టిడిపి కార్యకర్త పోపూరి చందుకు గాయాలు కాగా అతనిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కొంతసేపు జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ప్లాంట్ లోకి పుల్లారావు అనూహ్యంగా పోలీసుల మధ్యలోంచి దూసుకెళ్లి కొబ్బరికాయలు కొట్టి ప్లాంట్ ను ప్రారంభించారు. అయితే గతానికి భిన్నంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టువదలకుండా ప్లాంట్ ను ప్రారంభించి బయటికి రావడం పట్ల టిడిపి కార్యకర్తలు నూతనోత్సాహంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..
May 13, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట NTR సుజల పథకం వద్ద ఉద్రిక్తత... పోలీసులను తోసుకువెళ్ళి పథకాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి...టిడిపి కార్యకర్త కు గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

