728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2022

రూ.16వేల కోట్ల‌తో ఆస్ప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌ రూ.12వేల కోట్ల‌తో పాఠ‌శాల‌ల ఆధునికీక‌ర‌ణ‌

చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లం మ‌ద్దిరాల గ్రామంలో బుధ‌వారం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం.. కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆద్యంతం అత్యంత వైభ‌వంగా కార్య‌క్ర‌మం కొన‌సాగింది. గ్రామ‌స్తులు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ప్ర‌తి గ‌డ‌ప‌లో మంత్రికి సాద‌ర స్వాగ‌తం ల‌భించింది. మంత్రి ఇంటింటికీ వెళ్లి త‌మ ప్ర‌భుత్వం చేసిన, చేయ‌బోతున్న మంచిని వివ‌రించారు. ప్ర‌జాబ్యాలెట్‌తో పాటు, ముఖ్య‌మంత్రి స్వ‌దస్తూరితో రాసిన లేఖ‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల క‌ర‌ప‌త్రాల‌ను ఇంటింటికీ పంచారు. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వం ఏం చేసిందో వివ‌రించి చెప్పారు. ప్ర‌జ‌ల నుంచి అద్భుత స్పంద‌న ల‌భించింది. జ‌గ‌న‌న్న పాల‌న‌లో సంతోషంగా ఉన్నామంటూ ప్ర‌జ‌లు ప్ర‌తిస్పందించారు. 

అన్నింటా రికార్డే

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ చ‌రిత్ర‌లో నిల‌బ‌డేలా జ‌గ‌న‌న్న ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఏం చేసినా ఒక రికార్డే అనేలా కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయ‌ని తెలిపారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా 30 లక్ష‌ల‌కు పైగా అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీచేశామ‌ని, వారంద‌రికీ ఇళ్లు కూడా ప్ర‌భుత్వమే ఉచితంగా నిర్మించి ఇస్తోంద‌ని వివ‌రించారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వాలు ఇలా ప‌నిచేయలేద‌ని చెప్పారు. వైద్య ఆరోగ్య‌శాఖ‌లోనూ స‌మూల మార్పులు తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌లంద‌రికీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉచితంగా వైద్యం అందేలా చూస్తున్నామ‌న్నారు. నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు స‌త్వ‌ర‌మే అందేలా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో నాడు నేడు కింద అన్ని ఆస్ప‌త్రుల‌ను ఆధునికీక‌రిస్తున్నామ‌ని చెప్పారు. కొత్త‌గా మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. అన్ని టీచింగ్ ఆస్ప‌త్రుల‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. వీటి కోసం ఏకంగా రూ.16వేల కోట్లను ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఆధునికీక‌రిస్తున్నామ‌ని, అందుకోసం రూ.12వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేస్తున్నామ‌ని వివ‌రించారు. నాణ్య‌మైన విద్య‌, వైద్యం ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు అనేక సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ఏకంగా రూ.1.32 ల‌క్ష‌ల కోట్ల ను నేరుగా వారి వారి సొంత బ్యాంకు ఖాతాల‌కు జ‌మ‌చేశామ‌ని వివ‌రించారు. ఈ విష‌యాల‌న్నీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు.

 కార్య‌క్ర‌మంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,ఎంపీపీ దేవినేని శంకరరావు,జడ్పీటీసీ కోడె సుధారాణి,మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, కో ఆప్షన్ బాజీ,ఎంపీటీసీ మొహిద్దీన్,ఉప సర్పంచ్ వలి,పట్టాన అధ్యక్షడు పఠాన్ తలహ ఖాన్,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,జీడీసీసీ డైరెక్టర్ ఆరుమళ్ళ వెంకటశివ,సొసైటీ అధ్యక్షులు తోట బ్రహ్మాస్వాములు,బేరింగ్ మౌలాలి,పోలిశెట్టి మస్తాన్, నాయకులు మాలెంపాటి రామారావు,మాలెంపాటి నరసింహర్రావు,నాంపల్లి మనోహర్,షేక్ మస్తాన్,నూతలపాటి రాజేష్,గుత్తా నరసింహారావు,సండ్ర రాజేశ్వరరావు,మాలెంపాటి కోటేశ్వరరావు,గంగవరపు రాజా,జాష్టి శ్రీను,సండ్ర రంగారావు,అబ్దుల్ నబీ,బుడేసా,బాజీ,నన్నే,సండ్ర చిన్న,షేక్ సుభాని,గౌస్,జాన్ సుభాని,ఖాజాబీ,మహిమూన్,రజిని,జాష్టి నాగరాజా,నాంపల్లి సుబ్బయ్య,గుడిమెట్ల హనుమంతరావు,దరియా వలి,బడేసా,తొట్టెంపూడి శ్రీను,కిలారు రవీంద్ర,పఠాన్ దౌలత్ ఖాన్,ముసలయ్య,దండా నాగేశ్వరరావు,చప్పిడి బాలస్వామి,కొమిరిశెట్టి శ్రీనివాసరావు,సుబ్బారావు,పెరవలి చిన్నబాబు,కక్కెర శ్రీను,నాగబైరు వెంకట్,గుత్తా యామలయ్య,పంగులూరి రాయుడు,నకిరికంటి శ్రీకాంత్,ఇక్కుర్తి పవన్, పొన్నం చంద్రశేఖర్,నాగూర్ మరియు పలువురు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రూ.16వేల కోట్ల‌తో ఆస్ప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌ రూ.12వేల కోట్ల‌తో పాఠ‌శాల‌ల ఆధునికీక‌ర‌ణ‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE