చిలకలూరిపేట:
అసిస్ట్ సంస్థ వారి ఆధ్వర్యంలో తేది 16-06-2022 గురువారం జాబ్ మేళా కార్యక్రమము స్థానిక చిలకలూరిపేట అసిస్ట్ ఆఫీస్ నందు ఉదయం 9-30 గం. నుండి 2-30 గం. వరకు నిర్వహించబడును. ఈ జాబ్ మేళాలో యువతీ, యువకులు పాల్గొని ఈ క్రింది సంస్థలలో చేరే సదావకాశమును సద్వినియోగం చేసుకోవాలి. ఇది కేవలం గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు మాత్రమే.
1. స్కిల్స్ సోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు, యడ్లపాడు, బోయపాలెం నందు సూపర్ వైజర్స్ - 100 పోస్టులు, అర్హులు - యువతులు, విద్యార్హత - ఇంటర్, వయస్సు - 18 నుండి 24, వేతనం - రూ.11,000/
2. గుడ్ వర్కింగ్, గుంటూరు నందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 70 పోస్టులు, విద్యార్హత - 10 నుండి డిగ్రీ, అర్హులు - యువకులు, వయస్సు 18 నుండి 34, వేతనం - రూ.12,000/
కావున ఆసక్తి కలిగిన యువతీ, యువకులు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, రేషన్కార్డు, ఆధార్ కార్డు నకళ్ళు, ఫొటో, తీసుకొని అసిస్ట్ ఆఫీసు నందు ఉదయం గం. 9-00 లకు హాజరు కాగలరు. మరింత సమాచారం కొరకు ఫోన్ : 9182634233.

