728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 12, 2022

యడ్లపాడులోని మూడు ఇళ్ళల్లో డబ్బు, బంగారం దొంగతనం

చిలకలూరిపేట నియోజకవర్గము యడ్లపాడు లోని బీసీ కాలనీలో మూడు ఇళ్లల్లో దొంగలు హల్ చల్ చేశారు. 

కాలనీకి చెందిన బత్తుల సీతారామయ్య, తుర్లపాటి నాగమణి, వెంకటేశ్వర రాజు ల నివాసగృహాల లోకి శనివారం అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు ఆరున్నర సవర్ల బంగారు ఆభరణాలు, 27 వేల రూపాయల నగదు, గ్యాస్ సిలిండర్ ను ఎత్తుకెళ్లారు. 

ఆయా ఇళ్లలోని వారు అందరూ ఇంటి డాబాపై నిద్రలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి ప్రవేశించిన దుండగులు అల్మరాలు, బీరువాలు పగలగొట్టి అందులోని బంగారు ఆభరణాలు నగదు చోరీ చేశారు. వస్తువులను చెల్లాచెదురుగా పడవేశారు. 

ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి దొంగతనం జరగడంతో ఆందోళనకు గురైన ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: యడ్లపాడులోని మూడు ఇళ్ళల్లో డబ్బు, బంగారం దొంగతనం Rating: 5 Reviewed By: NEWS UPDATE