728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2022

ఇది అంకెల గారడీ ప్రభుత్వం.... రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి.... పదో తరగతి విద్యార్థులకు ఐదు గ్రేస్ మార్కులు కలపాలి: మాజీ మంత్రి పత్తిపాటి


చిలకలూరిపేట:  వైసిపి ప్రభుత్వం అంకెల గారడి ప్రభుత్వమని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా ఇప్పుడు ప్రభుత్వం చేసినట్లు చూపిస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో తెలిపారు.  సాక్షి పత్రికలో వచ్చే ప్రకటనలలో అంకెలు తప్పు అని ఆయన దుయ్యబట్టారు.  ఆంధ్రప్రదేశ్లో 2112 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వం 718 మందిని చూపించడం ఏమిటని ప్రశ్నించారు. మిగతా రైతులకు ఎందుకు చూపించరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ప్రభుత్వం  కొన్న ధాన్యానికి రైతులకు ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల టన్నుల ధాన్యం కొన్నారని... ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆరవై ఒక్క లక్షల మాత్రమే కొన్నట్లు పత్తిపాటి వివరించారు.  రైతుకు మద్దతు ధర ఇవ్వాలని, 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కోరారు.  రైతు రుణమాఫీ కింద గత టీడీపీ ప్రభుత్వం 15000 రూ.లిస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

టిడిపి ప్రభుత్వం లో 23 వేల రైతులకు ట్రాక్టర్ లు పంపిణీ చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం మూడు వేల రైతులకు మాత్రమే డాక్టర్లు ఇచ్చిందన్నారు.  80% నష్టపోయిన మిర్చి రైతులకు 20 వేల కోట్లు నష్టం వాటిల్లిందనీ, సీఎం కేవలం 70 కోట్లు మాత్రమే  ఇచ్చారని ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ చార్జీలు బాదుడు పేరిట 500 యూనిట్లు,  5600 రూపాయలు కరెంట్ బిల్లు దాటితే ఏసీఢీ చార్జీల పేరిట 9,200 కట్టాల్సిందేనని విద్యుత్ శాఖ అధికారులు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా సామాన్యుల పై విద్యుత్ చార్జీలు వడ్డించి నడ్డి విరుస్తున్నారని పత్తిపాటి తెలిపారు. 

పదో తరగతి పరీక్ష ఫలితాల వల్ల ఆంధ్రప్రదేశ్లో 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  గుజరాత్ లో 60 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని సీఎం జగన్ చెప్పడం ఏమిటని ఆంధ్రాలో 67% పాసయ్యారు చెబుతున్నారని ఇంతకంటే ఎక్కువ శాతం  ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పకుండా తక్కువ శాతం ఉన్న రాష్ట్రం పేరు సీఎం చెప్పటం తో సీఎం మనస్తత్వం అర్ధం అవుతుందని మాజీ మంత్రి పత్తిపాటి తెలిపారు.  పదవ తరగతి విద్యార్థులకు 5 గ్రేస్ మార్కులను కలపాలని పత్తిపాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మీడియా సమావేశంలో టిడిపి నాయకులు పలువురు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇది అంకెల గారడీ ప్రభుత్వం.... రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి.... పదో తరగతి విద్యార్థులకు ఐదు గ్రేస్ మార్కులు కలపాలి: మాజీ మంత్రి పత్తిపాటి Rating: 5 Reviewed By: NEWS UPDATE