728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 17, 2022

చిలకలూరిపేట వరలక్ష్మి ఫెర్టిలిటీ & మెటర్నిటీ ఆసుపత్రి లో IVF ద్వారా కవల పిల్లలు


 చిలకలూరిపేట: పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి వరలక్ష్మి ఫెర్టిలిటీ& మెటర్నిటీ ఆసుపత్రి లో శుక్రవారం అరుదైన ఘటన  చోటు చేసుకుందని డాక్టర్ గరికపాటి వరలక్ష్మి కొమ్మినేని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరాల ప్రాంతానికి చెందిన దంపతులకు ఒకే కాన్పులో టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కవల పిల్లలు పుట్టారని పేర్కొన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో తొలిసారి వరలక్ష్మి ఆసుపత్రి లో ఇదే ప్రప్రథమము,ఆసుపత్రి నెలకొల్పి సుమారు రెండున్నర సంవత్సరాలు కావస్తుంది. సుమారు 30కి పైచిలు ఐవిఎఫ్ ద్వారా దంపతులకు పిల్లలు పుట్టారని అన్నారు. తమ ఆసుపత్రిలో ఇద్దరు కవల పిల్లలు పుట్టడం చాలా సంతోషం దాయకం ఆన్నారు. చీరాల ప్రాంతాలకు చెందిన దంపతులు ఇద్దరు మాట్లాడుతూ చెన్నై ,హైదరాబాద్ లాంటి పెద్దపెద్ద ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం దక్కలేదని, వరలక్ష్మి ఆస్పత్రికి వచ్చిన తర్వాత తమకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని అన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. లక్షలరూపాయలు ఖర్చు పెట్టిన కొన్ని ఆస్పత్రుల వారు ఫలితాలను ఇవ్వలేకపోయాని అతి తక్కువ వైద్య ఖర్చుతో   సహాయం చేసిన డాక్టర్ సేవలను  మర్చిపోలేమని కొనియాడారు. కుటుంబసభ్యుల్లో ఆనందభాష్పాలు వ్యక్తపరచటమే కాకుండా నూతన ఉత్సాహంతో ఉన్నారని వారు తెలిపారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట వరలక్ష్మి ఫెర్టిలిటీ & మెటర్నిటీ ఆసుపత్రి లో IVF ద్వారా కవల పిల్లలు Rating: 5 Reviewed By: NEWS UPDATE