728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2022

సింగల్ గా పోటీ చేసిన 160 స్థానాలు వస్తాయి... బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట: ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేసినా 160 స్థానాలు గెలుచుకుంటుందని పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. చిలకలూరిపేట లోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. వెన్నెముక లేని జగన్ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అలవికాని హామీలు ఇచ్చి హామీలు అమలు పరచటానికి ప్రభుత్వ భూములను అమ్ముకొనున్నట్లు పత్తిపాటి తెలిపారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన భూములు ఈ ప్రభుత్వం ఎలా అమ్మ్మకుంటుందనీ ఆయన ప్రశ్నించారు. రైతుల భూములు అమ్ముకుంటే కోర్టులో కేసులు వేయనున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు.

ఈ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం లో లక్షలాది మందికి కోత విధిస్తున్నారని పత్తిపాటి విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న ముఖ్యమంత్రి ఢిల్లీ మెడలు వంచుతాం అని తన మెడ వంచుకొని తిరుగుతున్నాడని పత్తిపాటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజావేదిక కూల్చి మూడు సంవత్సరాలు అయిందని ... అక్కడి వెలుతున్న వారిని కూడా అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

 పేదల జీవితాలతో మద్యం వ్యాపారం చేసి జగన్మోహన్రెడ్డి చలగాటం ఆడుతున్నారన్నారు. వరుణ్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్టులో కల్తీ మద్యం అని తేలిందని విషతుల్యమైన మద్యం తాగితే చనిపోయార నీ.... లాబరేటరీ ఇచ్చిన రిపోర్టు పరిశీలించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టిడిపి ప్రభుత్వం కట్టిన ఇళ్ళు ఇవ్వటానికి కూడా చిలకలూరిపేటలో చేత కాలేదని... ప్రజలకు ఇచ్చిన స్థలాలు కొనడంలో అవకతవకలు జరిగియాయని ... భారీ ఎత్తున అవినీతి చేశారని ఆయన విమర్శించారు. యాభై రెండు ఎకరాల్లో కట్టిన ఇల్లు ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. టిడిపి మినీ మహానాడు పై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. వైసిపి ప్లీనరీ సమావేశాలకు వాళ్ల పార్టీ వాళ్లు కూడా రావడం లేదని ఆయన ఘాటుగా విమర్శలు సంధించారు. మీడియా సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, జవ్వాజి బుచ్చిబాబు తదితరులు ఉన్నారు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సింగల్ గా పోటీ చేసిన 160 స్థానాలు వస్తాయి... బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరిన ప్రత్తిపాటి Rating: 5 Reviewed By: NEWS UPDATE