చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని వసంత స్పిన్నింగ్ మిల్లు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 7 కిలోల గంజాయి, ఓ వేయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రతాపరెడ్డి గా గుర్తించారు. వసంత స్పిన్నింగ్ మిల్లు లో కార్మికుడిగా పనిచేస్తూ ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించుకొని స్థానిక పరిశ్రమలోని కార్మికులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎడ్లపాడు, నాదెండ్ల లోని కొన్ని స్పిన్నింగ్ మిల్లులలో గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.
చిలకలూరిపేట: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు... 7 కిలోల గంజాయి స్వాధీనం...స్పిన్నింగ్ మిల్లులలో జోరుగా గంజాయి అమ్మకాలు