చిలకలూరిపేట:పవన్ కళ్యాణ్ చిలకలూరిపేట జాతీయ రహదారి మార్గం గుండా ప్రకాశం జిల్లా కు వెళుతున్న సమయంలో చిలకలూరిపేటలో పవన్ కళ్యాణ్ కలుద్దామని వెళ్ళిన వీరాభిమాని కి గాయాలయ్యాయి. పూర్తి వివరాల ప్రకారం చిలకలూరిపేట పట్టణం వైఎస్ఆర్ కాలనీకి చెందిన తెల్ల మేకల శ్రీకాంత్ (37) పవన్ కళ్యాణ్ కలిసి దగ్గరగా షేక్ హ్యాండ్ ఇద్దామని దగ్గరకు వెళ్లగా అభిమానుల మధ్య జరిగిన తోపులాటలో సదరు వ్యక్తి కింద పడ్డాడు. దీంతో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోని ఒక కారు అతని కాలు మీదుగా వెళ్లినట్లు తెలుస్తుంది. గాయపడ్డ శ్రీకాంత్ ను 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్ కు శ్రీకాంత్ ను తరలించారు.
చిలకలూరపేట: పవన్ కళ్యాణ్ పర్యటనలో అభిమాని కాలు మీదుగా వెళ్ళిన పవన్ కాన్వాయ్ కారు