728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 23, 2022

ప్రజా సేవే పరమావధిగా... మంత్రి విడదల రజనికు జన్మదిన శుభాకాంక్షలు

ఆత్మ‌స్థైర్యంతో ముందడుగు 
సేవే ల‌క్ష్యంగా రాజ‌కీయాల్లోకి. .. 
చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని జ‌న్మ‌దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో
చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ చిరిత్రలో స‌రికొత్త ఆద్యాయానికి తెర‌లేపి, రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య‌శాఖ మంత్రిగా విడ‌ద‌ల ర‌జిని మొద‌టి జ‌న్మ‌దినాన్ని శుక్ర‌వారం జ‌రుపుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అభిమానులు పండుగ‌లా, మ‌హిళ‌లు త‌మ ఇంటి ఆడ‌ప‌డుచులా ఆద‌రించి జ‌న్మ‌దినోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో మ‌మేక‌మౌతున్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌వేశం, ఆమె ప్రస్థానం చూస్తే ఆమె ఆత్మ‌స్థైర్యం అర్ధ‌మౌతుంది. ఎంతో మంది యువ‌త‌కు ఆమె ఒక స్పూర్తి ప్ర‌ధాత‌గా నిలిచిన విధానం అబ్బ‌ర‌ప‌రుస్తుంది. రాజ‌కీయాలు ఎప్పూడూ పూల‌దారి కాదు. రాజ‌కీయాన్ని వైకుంఠపాళిగా పొల్చుతారు.ఇందులో పాములు, నిచ్చెన‌లు వుంటాయి. ఏమ‌రుపాటుగా ఉంటే చాలు పాముల లాంటి కొంత‌మందికి బ‌లికాక త‌ప్ప‌దు. అటువంటి రాజ‌కీయ రంగాన్ని ఎంచుకొని ఎద‌గాలంటే, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలంటే ఎంతో ధైర్యం, వ‌య‌సు, అనుభ‌వం కావాలి. కాని విడ‌ద‌ల ర‌జిని అంత‌ర్జాతీయ సాప్ట్‌వేర్ సంస్థ‌కు య‌జ‌మానిగా ఉంటూ కూడా ఆ హోదా, ద‌ర్పం అన్ని వ‌దులుకొని ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని త‌లంచారు. ముందుగా వీఆర్ సేవా సంస్థ ద్వారా స్వంత నిధులు వెచ్చించి వేలాది మందికి చేయూత అందించిన ఆమె మ‌రింత మందికి సేవ చేయ‌టానికి రాజ‌కీయాలే స‌రైన వేదిక‌గా భావించారు. ఆమె అల‌నాడు తీసుకున్న నిర్ణ‌య‌మే చిల‌క‌లూరిపేట చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయానికి నాంది ప‌లికింది. బీసీ మ‌హిళ‌గా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంద‌ట‌మే కాదు. ప‌ల్నాడు జిల్లాలో తొలి వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా విడ‌ద‌ల ర‌జిని నిలిచారు. 
ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మైన తీరు... 
ఒక వ్య‌క్తిని ఆరాధించాలంటే, ఆ వ్య‌క్తిని అనుస‌రించాలంటే, ఆ వ్య‌క్తిని గుండెల్లో నిలుపుకోవాలంటే ఎంతో బ‌ల‌మైన కార‌ణం ఉండాలి. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో విడ‌ద‌ల ర‌జిని ఆ స్థానం పొందారు. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల్లో ఆమె నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచి ఆమె వెంటే న‌డిచారు. ఒక‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గ స్వ‌రూప‌మే తెలియ‌ని ఆమె ప్ర‌తి ప‌ల్లె , ప‌ట్నం, పొలం తిరిగారు. ఆమె అంద‌రి నాయ‌కుల్లా కారులో వెళ్లుతూ చేతులు ఊపుతూ వెళ్లిపోలేదు. వారి క‌ష్టాల్లో పాలు పంచుకున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందారు. పొలంలో ప‌నిచేస్తున్న కూలీల‌ను క‌లిసారు. వారి ప‌రిస్థితి అడిగి తెలుసుకున్నారు. పూరి గుడిసెలు, అప్ప‌టి వ‌ర‌కు మురికికూపాలుగా ఉన్న వాడ‌ల్లో ఇంటింటి వెళ్లి త‌లుపు త‌ట్టారు. వారితో మ‌మేక‌మ‌య్యారు. వారి పెట్టింది తిన్నారు. వారి బాధ‌లు ఆల‌కించారు. దీంతో విడ‌ద‌ల ర‌జిని ప్ర‌తి ఇంట్లోత‌మ ఇంటి ఆడ‌ప‌డుచుగా ఆద‌రించారు. మంగ‌ళ‌హార‌తులు ప‌ట్టి ఆహ్వానించారు. అల‌నాడే ర‌జిని విజ‌యం ఖామ‌మైంది. అనుకున్న‌ట్లే గ‌తం తాలుకు చ‌రిత్ర‌ను తిర‌గ రాస్తూ కొత్త చ‌రిత్ర‌కు నాంది పలుకుతూ విజ‌యం సాధించారు. 
క‌రోనా క‌ట్ట‌డికి... బాధితుల‌కు ఆస‌రా అందిస్తూ... 
విడ‌ద‌ల ర‌జిని ఎమ్మెల్యేగా గెలిచిన కొంత‌కాలానికే క‌రోనా మ‌హ‌మ్మారి వాడ‌వాడ‌లా చుట్టేసింది. కొంత‌మంది నాయ‌కులు ఇదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు మొహం చాటిసి ప‌త్తా లేకుండా పోయారు. కాని ఎమ్మెల్య‌గా ర‌జిని అలా చేయ‌లేదు. క‌రోనా అంటే బ‌య‌ట‌కు సంచ‌రింటానికి సైతం భ‌య‌ప‌డే రోజుల్లోనే బాధితుల ఇళ్ల‌కు వెళ్లారు. వారికి ధైర్యం చెప్పారు. ఆర్ధికంగా న‌ష్ట‌పోయి ఉపాధి కోల్పొయిన పేద‌ల‌కు వీఆర్ పౌండేష‌న్ ద్వారా చేయూత అందించారు. నిత్యావ‌స‌రాలు, బియ్యం, కూర‌గాయ‌లు అందిస్తూ బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు అందుబాటులో క‌రోనా వైద్యం, వారిలో మ‌నోధైర్యం నింపేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. 52 ఎక‌రాల్లో ఉన్న టిడ్కో గృహ‌లను వైద్య సేవ‌లకు ఎంచుకొని చిల‌క‌లూరిపేట ప్రాంత‌వాసులే కాకుండా సుదూర ప్రాంత ప్ర‌జ‌లకు క‌రోనా వైద్యం అందించారు.దీంతో ఆమె చేప‌ట్టిన విస్త్ర‌త సేవ‌లు, ప‌క‌డ్పందీ ఏర్పాట్ల‌తో క‌రోనా నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడి పోయింది. ఇదే విష‌యంలోనే రాష్ట్రంలో విడ‌ద‌ల ర‌జిని పూర్తి స్థాయిలో ప్ర‌చుర్యం పొందారు. 
సంక్షేమం... అభివృద్ది రెండు క‌ళ్లుగా... 
చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే గా విడ‌ద‌ల ర‌జిని గెలుపొందిన కొంత‌కాలంలోనే గ‌తంలో ఎన్న‌డు లేని అభివృద్దిని సాధించిపెట్టారు. మూడున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలోనే నాటి పాల‌కుల పాల‌న‌కు ధీటుగా సంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లుగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల అభిమానం, ఆశీర్వాదాల‌తో పేట చ‌రిత్ర తిర‌గ‌రాస్తున్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో న‌వర‌త్నాల‌తో పాటు మ‌రికొన్ని హామీలిచ్చారు.ఇందులో 95శాతం హామీల‌ను నెర‌వేర్చారు. వీటితో పాటు ఇవ్వ‌ని హామీల‌ను కూడా అమ‌లు చేసి నెర‌వేర్చి మ‌హానుభావులు అని ప్ర‌జ‌ల చేత శెభాష్ అనిపించుకుంటున్నారు. స‌రిగ్గా మంత్రి విడ‌ద‌ల ర‌జిని కూడా సీఎం వైఎస్ జ‌గ‌న్ పంథానే అనుస‌రిస్తూ ప్ర‌జ‌ల విశేషాద‌ర‌ణ చూర‌గొంటున్నారు. ప్ర‌జ‌ల ఆశీస్సులు, ప్ర‌జాభిమానంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జినికు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు...
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజా సేవే పరమావధిగా... మంత్రి విడదల రజనికు జన్మదిన శుభాకాంక్షలు Rating: 5 Reviewed By: NEWS UPDATE