ఎడ్లపాడు మండలము లింగారావుపాలెం గ్రామ పరిధిలోని జామాయిల్ తోటలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ కూలీ మృతిచెందాడు. సంతమాగులూరుకు చెందిన ఓ వ్యక్తి లింగారావుపాలెంలో జామాయిల్ తోట కొనుగోలు చేసి కర్ర కొట్టిస్తున్నాడు. ఈ పనులకు నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన దావల అనిల్‌కుమార్(28) వచ్చాడు. తోటలో జామాయిల్ కర్రకు ఉన్న బెరడును యంత్రం సాయంతో తొలగిస్తుండగా ట్రాక్టర్ ఇంజన్‌కు కలిపి ఉన్న ఆ యంత్రం విడిపోయింది. దీనితో అనిల్‌కుమార్ యంత్రాన్ని ట్రాక్టర్ ఇంజన్‌కు లింకు చేస్తున్నాడు. అకస్మాత్తుగా ట్రాక్టర్ ఇంజన్ వెనక్కు జరిగింది. దీంతో ఇంజన్, యంత్రం మధ్య పడి అనిల్‌కుమార్ నలిగిపోయాడు.తీవ్రగాయాలపాలైన అనిల్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి జయంత్‌రావు ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్సై రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
June 22, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: యడ్లపాడు మండలం ట్రాక్టర్ ప్రమాదంలో కూలి మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

