728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 2, 2022

చిలకలూరిపేట రూరల్: తల్లి కి క్యాన్సర్... బాధతో కుమారుడు ఆత్మహత్య... విషాదంలో ఆ ప్రాంతం

చిలకలూరిపేట రూరల్ : తల్లికి క్యాన్సర్ అని తెలిసి కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి నూలుమిల్లులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి శనివారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి . 

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనపల్లి గ్రామానికి చెందిన మిన్నంటి వెంకటరమణ ( 34 ) అనే యువకుడు గత కొంతకాలంగా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఉన్న నూలు మిల్లులో కార్మికుడిగా పనిచేసుకుంటున్నాడు . అతనితోపాటు భార్య జానకి , కుమార్తెలు మేఘన , యమునలుడా ఉండేవారు . అయితే ఇటీవల స్వగ్రామంలో ఉంటున్న తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఆమెను బొప్పూడికి తీసుకొచ్చుకుని తనవద్దే వైద్యం అందిస్తున్నాడు . 

20 రోజుల క్రితం తల్లికి మందులు తీయించి ఆమెతోపాటు తన భార్య , పిల్లలను తీసుకుని గీతలపల్లి గ్రామంలో వదిలిపెట్టి వచ్చాడు . బొప్పూడి చేరుకున్నప్పటినుంచి అనారోగ్యానికి గురైన తల్లిని తలచుకుంటూ తీవ్రంగా దిగులుపడేవాడని సమీపంలోని క్వార్టర్స్ లో ఉంటున్న వారు తెలిపారు . అయితే ఈనెల 30 వ తేదీ నుంచి సదరు వెంకటరమణ కనిపించకుండా పోయాడు . 

ఈ నేపథ్యంలో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు అతను నివాసం ఉంటున్న క్వార్టర్స్ కిటికీలోనుంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు . దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు . గ్రామీణ ఎస్సై రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టమ్ కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మృతుడి సోదరి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై తెలిపారు .
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్: తల్లి కి క్యాన్సర్... బాధతో కుమారుడు ఆత్మహత్య... విషాదంలో ఆ ప్రాంతం Rating: 5 Reviewed By: NEWS UPDATE