728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2022

చిలకలూరిపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


చిలకలూరిపేట లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధిత ఏ పీ ఎస్ ఎం ఐ డి సి అధికారులను జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి ఆదేశించారు. ఆదివారం ఉదయం చిలకలూరిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లోతేటి  ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం లో ఉన్న ఇన్ పేషెంట్ లకు భోజన వసతి అందుబాటులో లేకపోవడం గుర్తించి వెంటనే ఆరోగ్య కేంద్రంలో ఉన్న పేషెంట్లకు భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సహజ డెలివరీ లను నెలకు 15 వరకు చేయడం గుర్తించి సహజ డెలివరీ లను మరింత పెంపొందించి నెలకు 30 డెలివరీలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డ్యూటీ డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవుట్ పేషెంట్  విభాగం బాగుందని మంచి సేవలు అందిస్తున్నారని ఆయన వైద్య సిబ్బందిని ప్రశంసించారు. అదేవిధంగా ఆసుపత్రి లో ఉండి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో ఉన్న వివిధ విభాగాలను (అతిసార, ప్రసూతి విభాగం, జనరల్ మెడిసిన్, శస్త్ర చికిత్సలు, జ్వరం తదితర) ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడ అందుతున్న వైద్యసేవలు గురించి పేషంట్ల నుండి వివరాలు సేకరించారు. అనస్తీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడం గుర్తించి అవసరమైన విధంగా ఎనస్థీషియన్ ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ Rating: 5 Reviewed By: NEWS UPDATE