గుంటూరు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆదివారం ఒక్కరోజే 40 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఒక గుంటూరు నగరంలోనే 25 కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి 4,తెనాలి 4, చేబ్రోలు 1 మంగళగిరి రూరల్లో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు నేడు తెరుసుకోనుండటంతో కరోనా కేసుల వ్యాప్తి మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. చిలకలూరిపేటలో ప్రస్తుతం ఒక కరోనా కేసు నమోదు కానప్పటికీ జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా చిలకలూరిపేటలో కరోనా కేసులు నమోదయ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా విషయంలో గతంలో పటిష్ట చర్యలు తీసుకున్న అధికారులు ప్రస్తుతం కూడా మాస్క్ వాడకంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... చిలకలూరిపేటలో అప్రమత్తత అవసరం