ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారి బైపాస్ పనులుజరుగుతున్న నేపథ్యంలో తిమ్మాపురం వద్ద బైపాస్ నిర్మాణం లో భాగంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది.ఇక్కడ గత మూడు నెలలుగా మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కు చెందిన చిన్నికృష్ణన్న,లక్ష్మీదేవమ్మ (50)భార్యభర్తలు కూలిపనుల నిమిత్తం పని జరుగుతున్న ప్రాంతం లో వుంటున్నారు.యధావిధిగా గురువారం నిర్మాణపనులలో భాగంగా పిల్లర్ల నిర్మాణం కొరకు తీసిన సుమారు 12 అడుగుల గుంట లో దిగి పనులు చేసే సందర్భంలో మట్టిపెళ్ళలు విరిగి లక్ష్మీదేవమ్మ మీద పడటంతో ఆమె వెళ్లి పిల్లర్ మీద పడటం జరిగింది.దీనితో సృహ కోల్పోయిన లక్ష్మీదేవమ్మ ను దగ్గరలోని వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి పిల్లర్ల నిర్మాణాలు జరిగేటప్పుడు తీసుకోవలిసిన కనీస జాగర్తలు కాంట్రాక్టర్ తీసుకోలేదని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
July 21, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మట్టి పెళ్లలు పడి మహిళ మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE



