728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2022

చిలకలూరిపేట: అతి క్లిష్టమైన ఆపరేషన్ చేసిన వరలక్ష్మి హాస్పిటల్... ప్రాణాపాయం నుండి బయటపడ్డ మహిళ


చిలకలూరిపేట: పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి వరలక్ష్మి ఫెర్టిలిటీ& మెటర్నిటీ ఆసుపత్రి లో క్లిష్టమైన ఆపరేషన్ చేశారు  డాక్టర్ గరికపాటి వరలక్ష్మి కొమ్మినేని . గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ (45) వరలక్ష్మి మేటర్నిటి అండ్ ఫెర్టిలిటీ వైద్యులు డాక్టర్ గరికపాటి వరలక్ష్మి వద్దకు రావడంతో పరీక్షలు  నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో గర్భాశయ కణితి ఉన్నట్లు గుర్తించారు.  వెంటనే కణితి తొలగించాలని వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా.... ఆశ్చర్యకరంగా ఆమె కడుపులో నాలుగున్నర కిలోల అతిపెద్ద గడ్డ (కణితి) ఉండటంతో అతి కష్టం మీద ఆపరేషన్ చేసి ఆమెకు కణితిని  తొలగించారు.  సహజంగా మహిళలకు పావుకిలో, అరకిలో బరువులో కనితలు వస్తుంటాయి.  కానీ ఈ మహిళకు ఏకంగా నాలుగున్నర కిలోల కణితి ఏర్పడటంతో అనుమానం వచ్చిన డాక్టర్ వరలక్ష్మి కణితి ముక్కను బయాప్సికి పంపారు.  దాంతో ఆ గడ్డ క్యాన్సర్గడ్డగా మారుతుందని తెలియడంతో ఆ మహిళ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డట్టు తెలిపారు.  అయితే చిన్నచిన్న సమస్యలకు గుంటూరు విజయవాడ హైదరాబాదు వెళుతున్న ఈ రోజుల్లో వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మేటర్నీటి హాస్పిటల్ లో అతిపెద్ద కణితిని తొలగించి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించారు చిలకలూరిపేటకు చెందిన వైద్యురాలు డాక్టర్ గరికపాటి వరలక్ష్మి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అతి క్లిష్టమైన ఆపరేషన్ చేసిన వరలక్ష్మి హాస్పిటల్... ప్రాణాపాయం నుండి బయటపడ్డ మహిళ Rating: 5 Reviewed By: NEWS UPDATE