చిలకలూరిపేట పట్టణంలో మాచర్ల కు చెందిన ముగ్గురు వ్యక్తులు బుల్లెట్లను దొంగతనం చేసి న కేసులో చిలకలూరిపేట పట్టణ పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 11 లక్షల విలువ కలిగిన ఐదు బుల్లెట్లు ఒక యూనికాన్ బైకును స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... మాచర్ల కు చెందిన మాచర్ల నవీన్ బాబు, చల్ల భవాని శంకర్, కమ్మ కాశి అని ముగ్గురు యువకులు మాచర్ల నుండి చిలకలూరిపేట పట్టణానికి వచ్చి రెక్కీ నిర్వహించి రాత్రిపూట ఇంటి ఎదుట పార్కు చేసిన బుల్లెట్ మోటార్ సైకిల్ల్లను దొంగిలించుకుని వెళ్తుంటారని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి పండరీపురంలో పట్టణ పోలీసులు చూసి పరిగెత్తిన ఇరువురిని వెంబడించిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా మాచర్ల నవీన్ బాబు, చల్ల భవాని శంకరులు చిలకలూరిపేట పట్టణంలో బుల్లెట్ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. మూడో వ్యక్తి అయినా కమ్మ కాశి పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సీఐ రాజేశ్వరరావు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మోటార్ బైకు కు జిపిఎస్ సిస్టంను పెట్టుకోవడం వల్ల వాహనాలు ఎక్కడున్నాయో సులువుగా తెలుసుకోవచ్చని ప్రజలు మోటార్ సైకిల్ లను వాహనాలను పార్క్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్బన్ సీఐ రాజేశ్వరరావు పుర ప్రజలను కోరారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సైలు మోహన్, ఫిరోజ్, మాచర్లు కానిస్టేబుళ్లు గోవిందరాజు, శివశంకర్, నారాయణరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ కా బడిన ఇద్దరినీ కోర్టుకు హాజరు పరుస్తామని తెలియజేశారు.
చిలకలూరిపేట పట్టణంలో బుల్లెట్లను దొంగతనం చేసిన ఇరువురు అరెస్టు ...11 లక్షల విలువ కలిగిన వాహనాలు స్వాధీన చేసుకున్న పోలీసులు