ఉమ్మడి గుంటూరు జిల్లాలో బుధవారం 56 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 39, మంగళగిరి 4, తాడేపల్లి 2, పెదకాకాని 1, పత్తిపాడు 1, తెనాలి 5, పొన్నూరు 1,నరసరావుపేట 1, చిలకలూరిపేట 1, నకరికల్లు 1 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి..
చిలకలూరిపేట పట్టణంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో చిన్నపిల్లలకు కొంతమందికి కరోనా వచ్చినట్లు తెలుస్తుంది. చిన్నపిల్లలకు జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పూర్తిస్థాయిలో మున్సిపల్ అధికారులు, వైద్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోపోతే చిలకలూరిపేటలో కూడా కరోనా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య శాఖ అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

