728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 28, 2022

ట్రావెల్ బస్సుల ఆఫీసుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి... అర్బన్ సీఐ రాజేశ్వరరావు


 చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో ఉన్న ట్రావెల్స్ యజమానులతో అర్బన్ సీఐ రాజేశ్వరరావు మాట్లాడి వారికి కొన్ని సూచనలు చేశారు. బస్ ట్రావెల్స్ ఆఫీసు  వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పలు సూచనలు చేశారు.  వచ్చే ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా పరిశీలించాలని బస్సుల్లో ఎక్కే ప్రయాణీకుడు  బస్సులో  ఏమి తీసుకు వెళ్తున్నారో పరిశీలించాలని కోరారు.  అనుమానస్పద వ్యక్తులు గాని ఏమైనా ఉంటే తక్షణమే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ట్రావెల్స్ యజమానులతో అర్బన్ సీఐ రాజేశ్వరరావు తెలియజేశారు.  ఇటీవల తాతపూడి వద్ద ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వద్ద కొంత నగదు పోవడంతో పట్టణంలోని ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు బస్సు టికెట్ బుక్ చేసినప్పుడు పూర్తి సమాచారం సేకరించి వారి వివరాలను తెలుసుకొని మాత్రమే వారికి టికెట్లు కేటాయించాలని ట్రావెల్స్ యజమానులకు సీఐ తెలియజేశారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ట్రావెల్ బస్సుల ఆఫీసుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి... అర్బన్ సీఐ రాజేశ్వరరావు Rating: 5 Reviewed By: NEWS UPDATE