చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ లో శుక్రవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
మార్టూరు నుంచి చిలకలూరిపేట వైపు బైక్ పై వస్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు కుతీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108వాహన సిబ్బంది ప్రధమ చికిత్స అందించి వైద్యశాలకు తరలించారు.
అక్కడే ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారును, నెల్లూరు నుంచి విశాఖ పట్నం వెళుతున్న లారీ ఢీకొనడంతో కారు ప్రక్క భాగం పూర్తిగా ద్వoసంఅయింది.
పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. రెండు రోడ్డు ప్రమాదాలు ఒకే సమయంలో జరగడం తో వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

