ఆగి ఉన్న బస్సు ను ను వెనకనుంచి స్కూటీ ఢీకొంది. ఎడ్లపాడు నక్క వాగు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వసంత నూనె మిల్లుకు చెందిన బస్సు కార్మికులను తీసుకువచ్చేందుకు ఎడ్లపాడు వైపు వెళ్తూ నక్క వాగు సమీపంలోని సుబాబుల తోట వద్ద హైవేపై నిలుపుదల చేసి డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే మార్గంలో గుంటూరుకు చెందిన తల్లి కూతుళ్లు తల్లి నాగలక్ష్మి కుమార్తె సాయి లక్ష్మి చిలకలూరిపేట వైపు నుంచి వెళుతుండగా స్కూటీపై వెళ్తున్నారు.
బస్సు సమీపంలోకి రాగానే స్కూటీ ముందు వెళ్తున్న బైక్ పై వారు రోడ్డుపై దిష్టి కొబ్బరికాయ కొట్టి వెళ్లడంతో అది గమనించిన స్కూటీ పై ఉన్న సాయి లక్ష్మి పక్కకు తీయబోయి అదుపుతప్పి ఆగి ఉన్న నూలు బస్సు వెనుక భాగంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా నాగలక్ష్మి తీవ్ర గాయాల య్యాయి. 108 వాహన సిబ్బంది నాగలక్ష్మి నీ గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదం
ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై మంగళవారం వారి జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. తిమ్మాపురం హైవే జంక్షన్ సమీపంలో ఉన్న చర్చి ఎదురుగా రోడ్డు దాటుతున్న కాలనీకి చెందిన మరియమ్మను చిలకలూరిపేట వైపు వెళ్లే గుర్తుతెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతి దేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.



