ప్రత్తిపాడు: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై చిలకలూరిపేట-గుంటూరు మార్గంలో ప్రత్తిపాడు పరిధిలోని తుమ్మలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ కారులో ఉన్న నలుగరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మరో యువతిని జీజీహెచ్‌కు తరలిస్తుండగా ఆమె కూడా మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
August 15, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.... నలుగురు మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

