చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కూడలిలో ఆదివారం బైకును లారీ వెనుక నుంచి ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన 40 సంవత్సరాల వ్యక్తి గుంటూరు నుంచి చీమకుర్తి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు
చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం