చిలకలూరిపేట: రాష్ట్రంలో ఏ హాస్పిటల్ కి వెళ్లినా ఏ ల్యాబ్ కు వెళ్లినా విష జ్వరాలతో ప్రజలు కిక్కిరిసిపోతున్నారనీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇలాంటి పరిస్థితులలో మంత్రి మాటలు చెప్పి కాలం వెళ్లపుచ్చుతున్నారనీ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కొండవీడు గ్రామం ఒక్కటే కాకుండా లింగారావుపాలెం గ్రామంలో కూడా డెంగ్యూ జ్వరాలతో మరణించా రన్నారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యం ఎక్కడన్నా సరిగ్గా అందుతుందా అని ప్రశ్నించారు. మాటలే కానీ చేతల్లో ఎక్కడా కనపడటం లేదంటూ రాష్ట్రంలో ప్రబలిపోతున్న డెంగ్యూ జరాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం చెందిందన్నారు.
జిల్లాలో మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేస్తామని కొందరు రెచ్చగొడుతున్నారని సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరిచి రాజధానుల విషయంలో రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు
ఆటో నగర్ విషయంలో ముస్లిం మైనార్టీలను స్థానిక మంత్రి మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉచితంగా స్థలం కొని ఆటోనగర్ ఇస్తామని చెప్పి .. చేసిన వాగ్దానాన్ని మరిచి ముస్లిం మైనార్టీలను మోసం చేయలేదా అని మంత్రి విడదల రజనిను ప్రశ్నించారు. రోడ్లు బాగా లేవని కనీసం రోడ్లు రిపేర్ అయినా చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

