728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 13, 2022

విజిలెన్స్ దాడులు... మూడు లక్షలకు పైగా అపరాధ రుసుము వసూలు


 నాదెండ్ల మండలంలోని 13 గ్రామాలలో గుంటూరు టౌన్ 2 మరియు విజిలెన్స్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్స్,సీ.హచ్ రమేష్, కే.వి. యల్.యన్.మూర్తి  ఆధ్వర్యంలో  13 గ్రామాలలో 31 బ్యాచ్ లుగా విద్యుత్ విజిలెన్స్ దాడులు నిర్వహించి అనాధికారికంగా విద్యుత్ వినియోగము వాడుచున్న 106 సర్వీసు లకు రు. 3,72,000/- అపరాధ రుసుం వేసినారు.దానిలో విద్యుత్ చోరి కింద నాదెండ్ల గ్రామంలో యన్.శేషయ్య, కనపర్తి గ్రామంలో యం.విజయ నిర్మల, పి.శ్రీనివాస రావు, గ్రామంలో కే. దీనారావు, అమీన్సాహెబ్ వారిపాలెమ్ లో జి.యలమందయ్య వారిపై కేసులు నమోదు చేసి రూ 1,43,000/- మరియు డైరెక్ట్ టాపింగ్ కింద 4 కేసులకు 4,900/-, అదనపు లోడు వినియోగం కింద 95 కేసులకు రూ 2,20,900/- మరియు అనధికార విద్యుత్ కింద 1 కేసుల రూ 4000/- అపరాధ రుసుము వేసినారు. పై అధికారుల అనుమతి తో రాబోవు రోజులలో అనధికార విద్యుత్ వినియోగం చేసినట్లయితే తరుచుగా దాడులు నిర్వహిస్తామని వారు చెప్పినారు. ఈ దాడులలో ముగ్గురు డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్స్, 11మంది అసిస్టెంట్ ఇంజనీర్స్ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నట్లు, చిలకలూరిపేట డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ , గణపవరం. పి.వి.యన్ ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విజిలెన్స్ దాడులు... మూడు లక్షలకు పైగా అపరాధ రుసుము వసూలు Rating: 5 Reviewed By: NEWS UPDATE