728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 15, 2022

చిలకలూరిపేట: అయ్యా... మా పరిస్థితి ఆలకించండి... మా రోడ్లు బురద మయం... జారి పడుతున్నాం...!!


 చిలకలూరిపేట: గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో రోడ్లు అక్కడక్కడ గోతులమయం వర్షపు నీటితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  అయితే ఒక కాంట్రాక్ట్ చేసిన తప్పిదానికి తాము ఇళ్లలోకి  వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నామని.... ఆ బురద మట్టిలో జారీ కొంతమంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రాంతవాసులు. చిలకలూరిపేట  పట్టణంలోని బ్రహ్మంగారి గుడి బజార్, వోగేరు వాగు రోడ్డులో సుమారు 150 కుటుంబాల వారు నివసిస్తున్నారు. అయితే వాగు పై నుండి బ్రిడ్జి నిర్మిస్తుండటంతో ఆ ప్రాంతంలో గ్రావెల్  వేయవలసిన కాంట్రాక్టర్ బురదమట్టిని రోడ్డుపై వేయడంతో కురుస్తున్న భారీ వర్షాలకు బురద మట్టి రోడ్డు మయమైంది.  ఈ సమస్యతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటే నరకం అగుపడుతుందని చెప్తున్నారు. బురద మట్టిపై జారి పడకుండా సదరు కాంట్రాక్టర్ వాటిపై డస్ట్ గాని ఇసుక గాని వేయవలసిందిగా ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అయ్యా... మా పరిస్థితి ఆలకించండి... మా రోడ్లు బురద మయం... జారి పడుతున్నాం...!! Rating: 5 Reviewed By: NEWS UPDATE