728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 31, 2022

ప్రతిభ గల విద్యార్థులకు జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అండగా ఉంటుంది...జాన్ సైథా


చిలకలూరిపేట: విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదని ప్రతిభగల విద్యార్థులకు ఎల్లవేళలా జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత షేక్ జాన్ సైధా అన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతిభగల విద్యార్థులకు ఫౌండేషన్   ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. చిలకలూరిపేట  మండలం మురికిపూడి గ్రామంలోని స్కూల్లో చదివిన  ప్రతిభగల 16 మంది విద్యార్థులకు  ఆర్థిక సహాయం అందజేశారు. పదవ తరగతిలో 550 పైగా మార్కులు సాధించిన ముగ్గురికి పదివేల రూపాయలు, 500 మార్కులు పైగా సాధించిన 13 మందికి 5000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.  అలానే 60 మంది వికలాంగులకు 2000 రూపాయలు చొప్పున సంస్థ ద్వారా సహాయాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో కంజుల వీరారెడ్డి, ఆది బాబు, వీరాంజనేయులు, రవ్వలకొండ, జాలాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రతిభ గల విద్యార్థులకు జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అండగా ఉంటుంది...జాన్ సైథా Rating: 5 Reviewed By: NEWS UPDATE