728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 2, 2022

చిలకలూరిపేట వరలక్ష్మి సంతాన సాఫల్య కేంద్రంలో చిన్నారులకు అత్యాధునిక వైద్యం


మాతృత్వాన్ని అందిస్తూ.. చిన్నారుల ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తూ.. 

వ‌ర‌ల‌క్ష్మి సంతాన సాఫ‌ల్య కేంద్రంలో..

చిన్నారులకు అత్యాధునిక వైద్యం 

నవజాత శిశువులకు సంజీవని గా ఆసుప‌త్రి 

చిలకలూరిపేట: మాతృత్వం ఒక వ‌ర‌మ‌ని భావిస్తారు.. వివాహ‌మై సంవ‌త్స‌రం గ‌డిస్తే చాలు పిల్ల‌లు క‌ల‌గ‌క పోతే దంప‌తుల వేద‌ను అంతే ఉండ‌దు. పిల్లల కోసం తిర‌గ‌ని  ఆసుపత్రి ఉండదు. మొక్కని దేవుడు ఉండడు. అయితే కొంతమంది మాత్రం పిల్లలు కలగకపోతే అది తమ దురదృష్టంగా భావిస్తారు. వైద్యపరమైన సహాయం తీసుకోవాలంటే భారీగా ఖర్చు అవుతుంతుంద‌ని, పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు  వెనకడుగు వేస్తారు. పేదవారు పిల్లలను కనడానికి అన్నేసి లక్షలు ఖర్చుపెట్టే పరిస్థితి ఉండదు. కొంతమంది మాత్రం పిల్లలపై ఆశతో అప్పు చేసి మరీ చికిత్స తీసుకుంటారు.  దీంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. కాని చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని వ‌ర‌ల‌క్ష్మీ సంతాన   సాఫ‌ల్య‌కేంద్రంలో అతి త‌క్కువ ఖ‌ర్చుతోనే,   ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారికి , అమ్మదనం లోని కమ్మదనాన్ని చ‌వి చూపిస్తుంది. 

నవజాత శిశువులకు సంజీవని

వ‌ర‌ల‌క్ష్మీ సంతాన   సాఫ‌ల్య‌కేంద్రంలో గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో దంప‌తుల‌కు మాతృత్వ మ‌ధురిమ‌ను అందించ‌ట‌మే కాదు .. హైరిస్కు కాన్పుల విష‌యంలోనూ, బ‌రువుత‌క్కువ‌గా పెట్టిన శిశువుల విష‌యంలోనూ తీసుకుంటున్న శ్ర‌ద్ద‌, వారు అందిస్తున్న భ‌రోసా త‌ల్లిదంద్రుల‌కు సంతోషాన్ని క‌లిగిస్తుంది. 

పిల్లలంటేనే కుసుమ కోమలాలు. నవజాత శిశువులైతే ఇంకా కోమలం. నెలలు నిండక ముందే పుట్ట‌డం, బ‌రువుత‌క్కువ‌గా ఉండే శిశువుల ప‌ట్ల‌ మరింత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. . కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే గానీ బతికించుకోవటం కష్టం.ఇలాంటి  పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇలా బెంగపడటం చూస్తూనే ఉంటాం. అతి సున్నితమైన ఇలాంటి పిల్లల సంరక్షణ చాలా కష్టమైన పని అనే విషయం చాలామందికి తెలియదు. బిడ్డను వెచ్చగా ఉంచాలి. శ్వాస సరిగా తీసుకునేలా, రక్తపోటు పడిపోకుండా, గుండె వేగం మరీ పెరగకుండా చూసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా? జీవక్రియలు ఎలా సాగుతున్నాయి? గ్లూకోజు, పోషకాలు, ఖనిజ లవణాల మోతాదులేమైనా తగ్గుతున్నాయా? ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతోందా? అనేవి గమనిస్తూ నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే చూస్తుండగానే పరిస్థితి చేయి దాటిపోవచ్చు. బిడ్డ ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. ఇదంతా శ్రమతో కూడుకున్న ప‌ని. సుశిక్ష‌ణ పొందిన వైద్యులు,సిబ్బందితో పాటు వారిని కాపాడుకోవ‌టానికి వృత్తి ప‌ట్ల చిత్త‌శుద్ది కూడా అవ‌స‌రం. ఇదంతా వ‌ర‌ల‌క్ష్మి సంతాన సాఫ‌ల్య కేంద్రంలో కొన‌సాగుతుంది.

రెండు సంవ‌త్స‌రాల కాలంలో 30 మంది హైరిస్కు శిశువుల‌కు ప్రాణ‌దాత‌

మంచి ఆరోగ్యంతో పోషకాహారంతో ఉన్న తల్లులకు పుట్టే బిడ్డలు 3.5 కేజీల బరువు ఉంటారు. కానీ భారతదేశంలో పిల్లల యొక్క కనీస బరువు 2.5 నుండి 2.9 కేజీలు. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు అంటారు.ప్రసవ సమయంలో ఉత్పన్నమయ్యే అనేక ఆరోగ్య సమస్యలు పిల్లల పై దీర్ఘకాలిక ప్రభావాలు కలిగి ఉంటాయి. వీరి అరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, బాధ్య‌త చాల కీలకం.  ఆసుప‌త్రిలో గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో 24 హైరిస్కు కాన్పుల ద్వారా  కేజీ, కేజీన్న‌ర బ‌రువు ఉన్న శిశువుల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. దీంతో పాటు కేవ‌లం 600 నుంచి 750 గ్రాముల బ‌రువుతో పుట్టిన 6గురు శిశువుల‌కు ప్రాణ‌దాత‌గా నిలిచారు. పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న ధ‌ర‌ల‌తోనే మాతృత్వాన్ని అందించటమే కాక, బ‌రువు త‌క్కువ గా పుట్టిన పిల్ల‌ల ఆరోగ్య విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకొని ప్రాణ‌దాత‌లుగా నిలుస్తున్న వ‌ర‌ల‌క్ష్మి సంతాన సాఫ‌ల్య కేంద్ర వైద్యుల కృషిని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట వరలక్ష్మి సంతాన సాఫల్య కేంద్రంలో చిన్నారులకు అత్యాధునిక వైద్యం Rating: 5 Reviewed By: NEWS UPDATE