728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 30, 2022

వాదోపవాదాలు మధ్య ముగిసిన కౌన్సిల్ సమావేశం. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం వైసిపి కౌన్సిలర్ మౌలాలి. టిట్కో గృహాలు ఇవ్వరా... టిడిపి కౌన్సిలర్లు గతంలో మీరు ఎందుకు ఇవ్వలేదు ... మేము 30 మంది నువ్వెంత.. వలేటి. జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించిన గంగా శీను... చైర్మన్ రఫాని


చిల‌క‌లూరిపేట‌: టిడ్కో గృహాలు నిర్మించి సంవ‌త్సాలు గడుస్తున్నా వాటిని ల‌బ్దిదారుల‌కు స్వాధీనం చేయ‌టంలో ఎందుకు జాప్యం జ‌రుగుతుంద‌ని, ల‌బ్దిదారులు గృహాల్లో ప్ర‌వేశించ‌కుండానే బ్యాంకుల నుంచి నోటీసులు వ‌స్తున్నాయ‌ని టీడీపీ ప్ర‌తిప‌క్ష కౌన్సిల్ నాయ‌కుడు గంగా శ్రీ‌నివాస‌రావు, టీడీపీ స‌భ్యులు ప్ర‌శ్నించారు. మున్సిప‌ల్ కౌన్సిల్ అత్య‌వ‌స‌ర స‌మావేశం చైర్మ‌న్ షేక్ ర‌ఫాని అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం మైల‌వ‌రపు గుండ‌య్య కౌన్సిల్ హాలులో నిర్వ‌హించారు. వాడీ వేడిగా కొన‌సాగిన స‌మావేశంలో ప‌లు మార్లు టీడీపీ, వైఎస్సార్ సీపీ కౌన్సిల‌ర్ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.  స‌మావేశంలో ఎజెండా చ‌ద‌వ‌డం పూర్తి కాగానే వైఎస్సార్ సీపీకి చెందిన 10వార్డు కౌన్సిల‌ర్ బేరింగ్ మౌలాలి లేచి త‌న వార్డులో అవినీతికి పాల్ప‌డుతున్నాన‌ని, రూ. 1.65ల‌క్ష‌ల సుజల స్ర‌వంతి ప్లాంటు పూర్తి చేయ‌కుండానే బిల్లులు చేసుకున్న‌ట్లు  టీడీపీ ఆరోపిస్తున్నార‌ని, తాను అవినీతికి పాల్ప‌డిన‌ట్లు రుజువు చేస్తే రాజీనామాకు సైతం సిద్ద‌మ‌ని స‌వాలు విసిరారు. ఇందుకు టీడీపీ స‌భ్యుడు గంగా శ్రీ‌నివాస‌రావు లేచి తాను స‌మాచార‌హ‌క్కు చట్టం ద్వారా పుర‌పాల‌క సంఘ అధికారుల‌కు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చార‌ని, అస‌లు ప‌నులే జ‌ర‌గ‌లేదంటున్నారు.. అస‌లు డ‌బ్బు ఖ‌ర్చు పెట్టారా అని ప్ర‌శ్నించారు. చైర్మ‌న్ ర‌ఫాని సూచ‌న‌ల మేర‌కు క‌మిష‌న‌ర్ స‌మాధానం చెబుతూ అస‌లు  ఏప‌నికి  నిధులు ఖ‌ర్చు చేయ‌లేద‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యంపై టీడీపీ స‌భ్యులు, వైఎస్సార్ సీపీ కౌన్సిల‌ర్ మౌలాలి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. చైర్మ‌న్ స‌ర్ధి చెబుతూ అధికారులు కూడా ఆ స‌మాచారం స‌రైన‌ది కాద‌ని చెబుతున్నార‌ని ఈ విష‌యంపై రాద్దాంతం అవ‌స‌రం లేద‌న్నారు.

డిసెంబ‌ర్ 15 లోగా మొద‌టి విడ‌త‌గా 2,200 మంది టిడ్కో గృహాలు అంద‌జేత అనంత‌రం టిడ్కో గృహాల‌పై టీడీపీ స‌భ్యురాలు  శివ‌పార్వ‌తి అడిగిన ప్రశ్న‌కు చైర్మ‌న్ షేక్ ర‌ఫాని స‌మాధానం ఇస్తూ డిసెంబ‌ర్ 15 లోగా మొదటి విడ‌త‌గా 2,200 మంది ల‌బ్దిదారుల‌కు టిడ్కో గృహాలు అంద‌జేస్తామ‌ని, మిగిలిన వారికి జ‌న‌వ‌రి నెలాఖ‌రుకు గృహాలు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ల‌బ్దిదారుల‌కు అన్ని వ‌స‌తులు క‌ల్పించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అందువ‌ల్ల‌నే జాప్యం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యం పై టీడీపీ స‌భ్యులు క‌ల్పించుకుంటూ త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో క‌ట్టిన ఇళ్లు ల‌బ్దిదారుల‌కు అంద‌జేయ‌టానికే సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టిందా అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో వైఎస్సార్ సీపీ స‌భ్యులు క‌ల్పించుకోవ‌టంతో తిరిగి వివాదం చెల‌రేగింది. ఇంటిని నిర్మాణం చేసుకొనే స‌మ‌యంలో ఎవ‌రైనా అన్ని వ‌స‌తులు ఉన్నాయా లేవా అని చూసుకుంటామ‌ని అటువంటిది వేలాది మందికి ఇంటి నిర్మాణం చేసే స‌మ‌యంలో క‌నీసం డ్రైనేజీ నీళ్లు బ‌య‌ట‌కు పోయే మార్గం గురించి ఆలోచించ‌ లేక‌పోవ‌టం అవివేక‌మ‌న్నారు. ఎటువంటి వ‌స‌తులు క‌ల్పించ‌కుండానే మూడు సార్లు గృహ ప్ర‌వేశాలు అంటూ మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు త‌తంగం న‌డ‌పార‌ని వైఎస్సార్ సీపీ స‌భ్యులు ఆరోపించారు. 

ఈ ద‌శ‌లో టీడీపీ స‌భ్యుడు గంగా శ్రీ‌నివాస‌రావు చైర్మ‌న్ పోడియం వద్ద‌కు దూసుకువ‌చ్చి ఆందోళ‌న‌కు దిగారు. స‌హ‌నం కోల్ప‌యిన చైర్మ‌న్ అస‌లు ఇళ్ల  నిర్మాణానికి కావ‌ల్సిన 52 ఎక‌రాల  స్థ‌ల సేక‌ర‌ణ దివంగ‌త ముఖ్య‌మంత్రి దివంగ‌త ముఖ్యమంత్రి డాక్ట‌ర్ వైఎస్సార్ వ‌ల్ల సాధ్య‌మంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే వైఎస్సార్ సీపీ కౌన్సిల్ స‌భ్యులు, టీడీపీ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఒక‌రిపై మ‌రోక‌రు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డటంతో చైర్మ‌న్ స‌భ ముగిసింద‌ని ప్ర‌క‌టించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. వైస్ చైర్మన్ టిడిపి కౌన్సిల్ నేత రంగా శ్రీనివాసరావు మీద తీవ్రంగా వాదపు ఆదాల జరిగాయి నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని ఒకరిపై ఒకరు తీవ్రప్రజాలంతో.

కౌన్సిల్ సమావేశం ముగియగానే బయట టిడిపి ప్రతిపక్ష నేత గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చీరాల రోడ్ లో నివాసం ఉంటున్న 18 మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారు ప్రశ్నించడంతో చైర్మన్ అక్కడే ఉండి సమాధానం చెబుతూ ఆ 18 మంది తమ వద్దకు రాలేదని వస్తే వారికి సమాధానం చెప్తామన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వాదోపవాదాలు మధ్య ముగిసిన కౌన్సిల్ సమావేశం. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం వైసిపి కౌన్సిలర్ మౌలాలి. టిట్కో గృహాలు ఇవ్వరా... టిడిపి కౌన్సిలర్లు గతంలో మీరు ఎందుకు ఇవ్వలేదు ... మేము 30 మంది నువ్వెంత.. వలేటి. జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించిన గంగా శీను... చైర్మన్ రఫాని Rating: 5 Reviewed By: NEWS UPDATE