728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 12, 2022

చిలకలూరిపేట నియోజకవర్గంలో విజిలెన్స్ దాడులు

ఎడ్లపాడు మండలంలోని 10గ్రామాలలో గుంటూరు టౌన్ 2 మరియు విజిలెన్స్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్స్, సీ.హెచ్.రమేష్, కే.వి. యల్.యన్.మూర్తి గారి ఆధ్వర్యంలో 10గ్రామాలలో 34 బ్యాచ్ లుగా విద్యుత్ విజిలెన్స్ దాడులు నిర్వహించి అనధికారికంగా విద్యుత్ వినియోగము వాడుచున్న 60 సర్వీసు లకు రు. 3,39,000/- అపరాధ రుసుం వేసినారు.దానిలో విద్యుత్ చోరి కింద 5 కేసులు బుక్ చేసి వారిపై కేసులు నమోదు చేసి రూ 1,55,000/- మరియు డైరెక్ట్ టాపింగ్ కింద 7 కేసులకు 8,000/-, అదనపు లోడు వినియోగం కింద 47కేసులకు రూ 1,71,500/- మరియు అనధికార విద్యుత్ కింద 1 కేసు కు రూ 4,500/- అపరాధ రుసుము వేసినారు. పై అధికారుల అనుమతి తో రాబోవు రోజులలో అనధికార విద్యుత్ వినియోగం చేసినట్లయితే తరుచుగా దాడులు నిర్వహిస్తామని వారు చెప్పినారు. ఈ దాడులలో ముగ్గురు డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్స్, 11మంది అసిస్టెంట్ ఇంజనీర్స్ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నట్లు, చిలకలూరిపేట డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, ఎడ్లపాడు అసిస్టెంట్ ఇంజనీర్ పి.సాంబశివరావు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో విజిలెన్స్ దాడులు Rating: 5 Reviewed By: NEWS UPDATE