728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 12, 2022

చిలకలూరిపేటలో దారుణం... భర్తను చంపిన భార్య

చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం లో దారుణం చోటుచేసుకుంది. భార్యా భర్తల ఘర్షణలో భార్య తన భర్తను మంచం కోడుతో తలపై కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు ప్రకారం పురుషోత్తపట్నంలో నివాసం ఉంటున్న సత్తార్ (42) షర్మిల (35) వీరికి సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు (13) కూతురు (11) వయసు కలవారు ఉన్నారు. అయితే భర్త తాగుడుకు బానిసవటం పనికి పోకపోవడంతో గత వారం నుండి ఘర్షణ జరుగుతుంది. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణలో షర్మిల కోపంతో భర్త సత్తార్ ను తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘర్షణలో కుమారుడికి గాయాలయ్యాయి. భర్త చనిపోవడంతో షర్మిల పరారయింది. సంఘటన స్థలానికి అర్బన్ సీఐ రాజేశ్వరరావు చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో దారుణం... భర్తను చంపిన భార్య Rating: 5 Reviewed By: NEWS UPDATE