చిలకలూరిపేట: నిత్యం లావాదేవీలు జరిగి కళకళ లాడుతూ ఉండే ఆఫీసుల్లో ఇదే ప్రధానమైన కార్యాలయం. ఇక్కడ ఐ అకౌంట్లతో పాటు పాయింట్ ఫైవ్ అమౌంట్ కమిషన్ వస్తేనే పనులు జరుగుతూ ఉంటాయని పనుల కోసం వచ్చేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగే లావాదేవిల్లో పని వ్యాల్యూషన్ను బట్టి పాయింట్ ఫైవ్ అమౌంట్ ఇస్తేనే పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ రోజుకు సుమారు 50 మంది వరకు ఈ ఆఫీస్ వద్దకు వచ్చి మధ్యవర్తుల ద్వారా తమ పనులు చేయించుకుంటూ ఉంటారు.
స్వయంగా వెళ్తే వారాల తరబడి తిరగాల్సిందే...
అయితే ఈ ఆఫీసు చుట్టుపక్కల సుమారు 15 మంది మధ్యవర్తులు కాచు కూచుంటారు. వీరి ద్వారా వెళ్తేనే పనులవుతాయనీ లేదంటే ఏదో వంక పెట్టి వారాలు తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పుతారని కార్యాలయానికి పనుల కోసం వచ్చేవారు తమ బాధను వెళ్ళబోసుకున్నారు. స్వయంగా వెళ్లి పని చేయమంటే ఏదో వంక పెట్టి పని కాదంటూ తిప్పి పంపుతారన్నారు. ప్రభుత్వం ఇటీవల వందలో కనీసం ఐదు శాతం సదరు వ్యక్తులు వచ్చి పనులు చేయించుకునేలా వెసులుబాటు కల్పించినా కానీ.... మధ్యవర్తి వస్తేనే ఇక్కడ పనులు చేయటం పాయింట్ ఫైవ్ అమౌంట్ తీసుకోవటం ఆనవాయితీగా మారింది
ఐ అకౌంట్ భారీగా వున్న రోజు సెలవు పెట్టి... ఇన్చార్జిను వేస్తారు!?
ఇంకో విషయం ఏమిటంటే ....ఐ అకౌంటు భారీగా ఉన్న రోజు అవసరమైతే ప్రధాన అధికారి ఒక పూట సెలవు పెట్టి ఇన్చార్జి ను నియమించి ఇన్చార్జి ద్వారా ఆ పనిని చక్కబెడతారనే విషయం మధ్యవర్తులు చెప్పుకుంటున్నారు. ఇన్చార్జి సంతకంతో పని అయితే ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోదనే నమ్మకం వుంది. ఇంకో విషయం ఏమిటంటే మంగళవారం, శుక్రవారం ఈ కార్యాలయానికి పనుల మీద వచ్చేవారు తక్కువ మంది ఉంటారు కాబట్టి, 300 రూపాయలు కు చేసే పనులు ఆ రెండు రోజులే చేస్తారనీ బ్యాంకు ఉద్యోగులు వాపోతున్నారు. మిగతా రోజుల్లో వస్తే ఆ కాగితాలు కూడా ముట్టుకోరు సదరు ప్రభుత్వ కార్యాలయ అధికారులు. ఈ కార్యాలయంలో పనిచేసే ఒక ఎంప్లాయ్ ఇటీవల ఒక నెలలో ఐదు చోట్ల స్థలాలు కొని అమ్మి లక్షల్లో లాభాలు అర్జించాడు. ఒక ఫంక్షన్ హాలు కోట్లలో బినామీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. అతను చెబితేనే కార్యాలయంలో పనవుతుంది. అతని ద్వారానే పాయింట్ ఫైవ్ అమౌంట్ ప్రధాన అధికారికి మిగతా వారికి పంపిణీ జరుగుతుంది.
ఈ అధికారులకు ఏసీబీలో చుట్టాలు ఉన్నారట!
ఇక సదరు ఉద్యోగికి ఏసీబీలో మంచి పలుకుబడి ఉన్నట్లు చెప్పుకుంటూ ఉంటారు. తన బంధువే ఒకరు ఏసీబీలో ఉద్యోగం చేస్తున్నారని తమకేమీ కాదని ఆయన అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు. గుంటూరులోని ఒక ప్రజాప్రతిని ద్వారా ఈ కార్యాలయా ప్రధాన అధికారి ఇక్కడ పోస్టింగ్ వేయించుకొని తనకేమీ కాదని తను ఎంత సంపాదించుకున్న, తన మీద ఫిర్యాదులున్నా స్థానిక ప్రజాప్రతినిలెవరు తన జోలికి రారని చెప్పుకుంటూన్నారు. రోజుకు సుమారు రెండు నుంచి రెండున్నర లక్షలు ఆదాయం కూడా పెట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

