728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 28, 2022

ఐ అకౌంటంటే తెలుసా !?... ఈ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు కార్లలోనే వస్తారు... ఎక్కడా కాని పనులు ఇక్కడే అవుతాయి...!?


ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం పచ్చగా బతుకుతుందని.... ఆ కుటుంబానికి రిటైర్డ్ అనంతరం జీవితాంతం పెన్షన్ ద్వారా అయినా  సుఖంగా గడపవచ్చు అని కోరుకుంటారు ప్రతి ఒక్కరు . కానీ ఆ కార్యాలయంలో ఉద్యోగం వస్తే ఎన్నో తరాలకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పుకుంటూ ఉంటారు.  కొద్దిరోజులు చేసిన చాలు జీవితాంతం బతికేయొచ్చు అంటారు. 

అటువంటి కార్యాలయంలో ఐ అకౌంట్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది... ఐ అకౌంట్ అంటే ఈ పని చాలా క్రిటికల్ చేయకూడని పని కాబట్టి ఈ పనిని ఆన్లైన్ ద్వారా వేరే మండలంలో గాని వేరే ప్రాంతంలో గాని పెట్టుకొని చేపించుకో ....దానికి అప్పుడు నేను అప్రూవల్ ఇస్తానంటూ భరోసా ఇస్తాడు ఆ కార్యాలయ అధికారి... ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడో కాని పనులు చిలకలూరిపేటలోని  ఈ ప్రభుత్వ కార్యాలయంలోనే అవుతున్నాయని ఇటు ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలోని పెండింగ్ పనులన్నీ చిలకలూరిపేట ప్రభుత్వ కార్యాలయంలోనే యదేచ్చగా జరుగుతున్నాయినే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరానికి సుమారు కొన్ని వందల పనుల వరకు చేయకూడని పనులు చేసి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు బతకొచ్చు అన్నట్టు సంపాదించుకుంటున్నరనే విషయం కార్యాలయం వద్ద గుసగుసలు గా చెప్పుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే ....ఇంకా రోజు ఎన్ని పనులు అవుతాయో అన్ని పనులకు ఒక్కొక్క పనికి  500 ఆ తర్వాత లక్షకు ఐదు శాతం కమిషన్ ఇవ్వలేదా.... సర్వర్ డౌన్ ఇది తరచూ వినిపించే మాటలు తరచూ వినపడే మాటలు.ఈ కార్యాలయంలో పనిచేసే వారు కార్లలో వచ్చి కార్లల్లో వెళతారు.   కార్లలోనే వస్తారు అంటే వీరు సంపాదన ఎంతో  అర్థం చేసుకోండి.

ఈ కార్యాలయంలో పనులు జరగాలంటే స్వామి భక్తి చాటుకునే మధ్యవర్తి ద్వారా  మాత్రమే పనులవుతాయి.  ఆ మధ్యవర్తిని ఆశ్రయిస్తేనే ఆ పని పూర్తి చేసి ఎంచక్కా కాగితాలు బయటికి తెచ్చిస్తారనే పని మీద వచ్చే వారు వారిని ఆశ్రయిస్తారు.

ఈ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి బినామీ పేరు  మీద చిలకలూరిపేటలో ఒక ఫంక్షన్ హాల్ కొంటూ అగ్రిమెంటు చేసుకోవటం చిలకలూరిపేట లోనే చర్చనీయాంశంగా   మారింది.  ఈ కార్యాలయంలో ఉద్యోగులు సాయంత్రానికి తమ కలెక్షన్ ఎంచక్కా జాతీయ రహదారిపై కార్లు  అపి మరి సి. సి కెమెరాలు లేని చోట పంచుకుంటారు...  ఒక ప్రజా ప్రతినిధి పి. ఏ  వద్దనే లంచం తీసుకొని గతంలో కొద్దిరోజులు సెలవు పెట్టారు ఆ అధికారి. మరలా గతంలో లానే  హస్తలాఘవం ప్రదర్శిస్తున్నాడనే విమర్శలు వెలుగుతున్నాయి. ఈ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా పనిచేయవట మరి.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఐ అకౌంటంటే తెలుసా !?... ఈ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు కార్లలోనే వస్తారు... ఎక్కడా కాని పనులు ఇక్కడే అవుతాయి...!? Rating: 5 Reviewed By: NEWS UPDATE