డిసెంబర్ 31 2022 సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని వ్యాపార దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్ రూల్స్ కి అనుగుణంగా సరైన సమయంలో మూసివేయాలి.
డిసెంబర్ 31 వ తేదీ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపరాదు. మైనర్లు డ్రైవింగ్ లైసెన్సు లేని వారు ముఖ్యంగా బైకుపై ముగ్గురు ప్రయాణించటం (త్రిబుల్ రైడింగ్) వంటి చర్యలు కి ఎవరైనా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.
ఇళ్ల మధ్యలో మరియు బహిరంగ ప్రదేశాలలో డీజే బాక్స్ లు పెట్టరాదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. పట్టణ ప్రజలు రూల్స్ కు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని అర్బన్ సీఐ రాజేశ్వరరావు తెలియపరిచారు..

