చిలకలూరిపేట: చిలకలూరిపేట రాజకీయలు ఎప్పుడు ఒకేలా ఉండవు. గత చరిత్ర ను పరీక్షిస్తే ఇదే నిజమని స్సస్టమౌతుంది. సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు, తద్వారా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేందుకు యువకుడు సంసిద్దమౌతున్నాడు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నాడు. ప్రతి రోజూ ఏదో సేవా కార్యక్రమం చేపడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాడు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గతంలో ముందుగా ప్రజలకు చేరువ కావటానికి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో మమేకమయ్యారు. ఇదే ఫార్మ లా ఫాలో అవుతున్న జాన్‌సైదా తన జ్ఞానేశ్వర ఫౌండేషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్లటానికి , వారి ఆదరణ చూరగోరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
జనవరి నుంచి విస్త్రత స్థాయిలో ప్రజల్లోకి...
జనవరి నుంచి పూర్తి స్తాయిలో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి టికెట్ సాధించేందుకు పార్టీ నేతల కలసి ఆశీస్సులు, వారి మద్దతు సమీకరిస్తున్నాడు. ఇప్పటికే పలువురు మాజీ కౌన్సిలర్లు, మండలాలకు చెందిన నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ముస్లిం మైనారిటీ లీడర్లు, ఆయన వెంట ఉండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. చాపకింద నీరులా కొందరు సీనియర్లు, నేతలు జాన్‌సైదాకు మద్దతు ఇవ్వటానికి సిద్దమైనట్లు సమాచారం . ఇదే జరిగితే రానున్న ఎన్నికలకు జాన్‌సైదా వైఎస్సార్ సీపీ నుంచి టికెట్ ఆశించే వ్యక్తులకు పోటీ ఇవ్వనున్నారు.చిలకలూరిపేట లో పరిస్థితులు ఏ విధంగా మారనున్నాయో వేచి చూద్దాం ..?

