728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 20, 2022

వాట‌ర్ పైపుల్లోనూ నకిలీలు... చిలకలూరిపేటలో అశీర్వాద్ పేరిట న‌కీలి వాట‌ర్ పైపుల‌ను అంట‌గ‌డుతున్న వ్యాపారులు... వాట‌ర్ పైపుల న‌కీలిల‌తో విస్తుపోయే నిజాలు

చిలకలూరిపేట: కాదేది న‌కీలిల‌కు అన‌ర్హం.. అన్న చందాన కొంత‌మంది అక్ర‌మార్జ‌న‌కు అల‌వాటు ప‌డిన వ్యాపారులు రెచ్చిపోతున్నారు. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు న‌కీలి వ‌స్తువుల‌ను బ్రాండేడ్ వ‌స్తువుల పేరిట పేద, మధ్య తరగతి ప్రజలకు నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నారు. వినియోగదారుడు వస్తువులను కేవలం నమ్మకం మేరకు కొనుగోలు చేస్తాడు. ఈ సెంటిమెంటును ఆసరాగా అడ్డుపెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు.. అక్రమార్జనకు అలవాటు పడ్డ వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ దందాని కొనసాగిస్తున్నారు. బ్రాండెడ్ వ‌స్తువుల‌కు ధీటుగా ఉండ‌టం, ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టంతో వినియోగ‌దారులు ఈ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి న‌ష్ట‌పోతున్నారు. వ్యాపారులకు ఈ వ్యాపారం కాసులు కురిపిస్తుండ‌టంతో, లాభాలు అధికంగా ఉండ‌టంతో వీటినే విక్ర‌యించ‌టానికే ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. 

న‌కీలితో ప్ర‌మాదం...
న‌కీలివ‌స్తువులు ఉన్న వినియోగ‌దారులు రెండు విధాలుగా న‌ష్టపోయే ప్ర‌మాదం ఉంది. న‌కీలి వ‌స్తువులు కొనుగోలు చేసిన వినియోగ‌దారుడు దానికి వినియోగించే స‌మ‌యంలో ప్ర‌మాదాల‌కు గురి అయ్యే అవ‌కాశం ఉంటుంది. మ‌రో వైపు ఆ వ‌స్తువు కొనుగోలుకు వెచ్చించిన ధ‌నం న‌ష్ట‌పోతునన్నారు. ప‌ట్ట‌ణంలో మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చి ప్లంబింగ్‌ అండ్ ఎల‌క్ట్రిక‌ల్ దుకాణాలు ఏర్పాటు చేసుకొన్న కొంత‌మంది ఈ దందాకు తెర‌లేపారు. వీరు కొంత‌మంది మేస్త్రుల‌కు అధిక క‌మీష‌న్ ఆశ చూపి వినియోగ‌దారులను త‌మ దుకాణాల వైపు ర‌ప్పించుకుంటున్నారు. 

వాట‌ర్ పైపుల న‌కీలిల‌తో విస్తుపోయే నిజాలు.. 
ప్ర‌తి ఇంటి నిర్మాణానికి వాట‌ర్ పైపులు అవ‌స‌రం అత్య‌వ‌స‌రం. పైపుల నుంచి ఇందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఫింటింగులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటికి వాట‌ర్ పైపులు అవ‌స‌ర‌మౌతాయి. అత్య‌ధికంగా ప్ర‌జ‌లు బ్రాండెడ్ కంపెనీ ఆశీర్వాద్ పైపుల‌ను కొనుగోలు చేయ‌టానికి ఆస‌క్తి క‌న‌ప‌రుస్తారు. దీన్ని గుర్తించిన వ్యాపారులు న‌కీలి ఆశీర్వాద్ కంపెనీ పైపుల‌ను వినియోగ‌దారుల‌కు అంట‌గ‌డుతున్నారు. నాణ్య‌త విష‌యంలో న‌కీలి పైపులు నాసిర‌కంగా ఉండ‌టంతో పాటు బ‌రువు కూడా తేడా ఉంటుంది. అయితే మేస్త్రీ చెప్పార‌ని అదే నిజ‌మైన బ్రాండ్‌డ్ పైపుగా కొనుగోలు చేస్తారు. ఇది కొన్న కొన్ని రోజుల‌కే ద్వంస‌మౌతుంటాయి. ప‌ది అడుగుల పైపుల నే ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు. ప‌ది అడుగుల పైపు ఒరిజ‌న‌ల్ కంపెనీది అయితే రూ. 410 అవుతుంది. అదే న‌కీలి పైపును ప‌ది అడుగుల‌ది రూ. 350 ల‌కే అమ్ముతున్నారు. ప‌ట్ట‌ణంలోని బోస్‌ రోడ్డులో ఉన్న కొంత మంది వ్యాపారులు సైతం చిల‌క‌లూరిపేట లోని మ‌హారాష్ట్ర కు చెందిన దుకాణాల నుంచి కొనుగోలు చేసి వినియోగ‌దారుల‌కు అంట‌గ‌డుతున్నారు. ఇటువంటి నిఘా, దాడులు లేక పోవ‌టంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల ఆశీర్వాద్ కంపెనీకి చెందిన ప్ర‌తినిధులు కూడా ప‌లు దుకాణాల‌ను ప‌రిశీలించి వెళ్లారు. సంబంధిత అధికారులు ఈ విష‌యంపై స‌మ‌గ్ర విచార‌ణ జురిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వాట‌ర్ పైపుల్లోనూ నకిలీలు... చిలకలూరిపేటలో అశీర్వాద్ పేరిట న‌కీలి వాట‌ర్ పైపుల‌ను అంట‌గ‌డుతున్న వ్యాపారులు... వాట‌ర్ పైపుల న‌కీలిల‌తో విస్తుపోయే నిజాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE